ఏజెన్సీ మన్యంలో గిరిపుత్రులకు తప్పని తిప్పలు.
అల్లూరి జిల్లా అడ్డతీగల మండలం పింజర్ల కొండ గ్రామానికి చెందిన బాలింత కష్టాలు..
ప్రసవం అయినా బాలింతాను అతి కష్టం మీద వాగు దాటిస్తున్న కుటుంబ సభ్యులు..
కాకినాడ జిల్లా ఏలేశ్వరం హాస్పిటల్ లో గత మూడు రోజుల కిందట పింజర్లకొండ గ్రామానికి చెందిన వెలుగుల మేరీ జ్యోతిక రెడ్డి అనే మహిళకు అయినా ప్రసవం..
ప్రసవం అనంతరం చంటి బిడ్డతో గ్రామానికి వెళ్లేందుకు బాలింతను అతి కష్టం మీద వాగు దాటుతూ మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు ..
నాచు పట్టి ఉన్నా సబ్టా పై ప్రమాదం పొంచి ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో తమ గ్రామం పింజర్ల కొండ వెళ్లిన బాలింత...
వాగుపై ఉన్నా సబ్ట్ట పైనుండి బిడ్డను ఒకరు.. తల్లిని మరొకరు మోస్తూ తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు...
అదుపుతప్పి కాలుజారితే గల్లంతయ్యే పరిస్థితి...
రంపచోడవరం ఏజెన్సీలోని మండల కేంద్రం అడ్డతీగలకు కూత వేటు దూరంలో ఉన్న పింజరకొండ వెళ్లాలంటే ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఈ కొండవాగును దాటాల్సిందే..
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ గ్రామానికి చేరక తప్పని పరిస్థితి.