ఘనంగా భగత్ సింగ్ 117 జయంతి వేడుకలు.

 అన్నమయ్య జిల్లా,

రాజంపేట,

28/09/2024.


*ఘనంగా భగత్ సింగ్ 117 జయంతి వేడుకలు.*








                           స్వాతంత్ర సమరయోధుడు షాహిద్ భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా రాజంపేటలోని నలంద జూనియర్ కళాశాలలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుబ్బరాయుడు మరియు పిడిఎస్ యూ జిల్లా అధ్యక్షుడు నేతి నాగేశ్వర ఉపాధ్యాయులు కలిసి  భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. 

                        ఈ సందర్భంగా పిడిఎస్ యూ  జిల్లా అధ్యక్షుడు నేతి నాగేశ్వర మాట్లాడుతూ భగత్ సింగ్ తన చిన్ననాటి నుండే స్వాతంత్ర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడని నా ప్రాణం నా జీవితం దేశంకే అంకితం *నా నెత్తురు వృధా కాదు* అంటూ అప్పట్లోనే ఆయన దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చేరగని ముద్ర వేసుకున్నారు. కార్మిక వివాదాల బిల్లులకు ఢిల్లీ అసెంబ్లీలో చట్టాలుగా చేస్తున్న సమయంలో భగత్ సింగ్ పొగ బాంబులు వేసి కరపత్రాలు చల్లుతూ ఉపన్యాసాలు చేశారని, *ఇంక్విలాబ్ జిందాబాద్ - సామ్రాజ్యవాదం నశించాలి* అని బిగ్గరగా నినదీస్తూ యువతలో చైతన్య స్ఫూర్తి నింపి, యావత్ భారతదేశ యువతను ఉత్తేజపరిచి దేశ స్వాతంత్రం కోసం జరిగే స్వాతంత్ర్య ఉద్యమ పోరాటంలో యువతను భాగస్వామ్యం చేయడంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదులు అంతర్జాతీయ నియమాలను తుంగలో తొక్కి విప్లవ వీరుడు సర్దార్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవులను ఉరితీసే ముందు ఉరికొయ్యలను సైతం వారు ముద్దాడారని కొనియాడారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, దోపిడీ, పీడన లేని సమాజం కోసం ఉరికంబం ఎక్కి దేశం కోసం తమ ప్రాణాలు అర్పించిన షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు మరణించరాని వారి అమరత్వాన్ని, పోరాట స్ఫూర్తిని నేటి యువత, విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థి యువతరం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.


 *కళాశాల ప్రిన్సిపల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ.*


 నేటి యువతరం అంత ఇలాంటి ఒక గొప్ప నాయకుడిని మరిచారని దేశంలో ఉన్న ప్రజలందరికీ స్వతంత్రం లభించింది అంటే ప్రధాన నాయకుడిగా భగత్ సింగ్ అని చెప్పారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భగత్ సింగ్ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని విద్యార్థులతో తెలిపారు.


                    ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు పట్టణ కమిటీ సభ్యుడు రామ్ చరణ్  నాయకులు జహీర్, గుల్ డీప్, యాగ్నేష్, శివారెడ్డి, శివనాథ్  మరియు ఉపాధ్యాయలు మహేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.