తిరుపతి జిల్లా...రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత భద్రతా ఏర్పాట్లు700 మంది పోలీసులు మోహరింపు.
రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన దృష్ట్యా, కార్యక్రమం సజావుగా మరియు విజయవంతమయ్యేలా పోలీసు శాఖ విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపిఎస్.,
తిరుపతి:-రేపు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు సిటీ పర్యటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి, కాన్వాయ్ రిహార్సల్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., మరియు జిల్లా కలెక్టర్ శ్రీ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర ఐఏఎస్.,గారు పాల్గొన్నారు.
హెలిపాడ్, శంకుస్థాపన చేయు ప్రదేశాల వద్ద పటిష్టమైన బ్యారికేడ్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ సంబంధిత అధికారులకు సూచించారు.
సేఫ్ హౌస్, సేఫ్ హాస్పిటల్ లను పరిశీలించి, అక్కడ కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తూ, వైద్యులు, వైద్య సామాగ్రి అందుబాటులో ఉండాలని సంబంధిత అధికారులను కోరారు.
రేణిగుంట ఎయిర్పోర్ట్ వద్ద కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ గ తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటన సమయంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకున్నామని ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు అయన తెలిపారు..
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లు. శ్రీ కులశేఖర్ శాంతి భద్రతలు, శ్రీ రాజేంద్ర సెబ్,
ఏ ఆర్ శ్రీనివాసులు,డీఎస్పీ లు,ఐ.ఎస్.డబ్ల్యు అధికారులు, శ్రీ సిటీ ఎండి, ఆర్డిఓ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.