కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం,హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలిఎన్ ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్

 


కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం,హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి


ఎన్ ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్


పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌క


తాలో ఆర్‌జీ కార్  మెడికల్ కాలేజ్ చెందిన ట్రైయినీ వైద్యురాలు మొుమిత దేబ్ నాథ పై జరిగిన అత్యాచారం మరియు హత్యకు నిరసనగా నిందితులను కఠినంగా శిక్షించాలని రాప్తాడు (మం) గొందిరెడ్డి పల్లి (గ్రామం) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా ఎన్ ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ మాట్లాడుతూ ఆగస్టు 9వ తేదీన వైద్య విద్యార్థిపై అత్యాచారం జరిగిన ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు .ఈ మధ్యకాలంలోనే చాలా రాష్ట్రాలలో మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హత్యాచారాలకు పాల్పడుతూన్న కొందరు పెద్ద పెద్ద నాయకుల అండదండలతో బయటకు  వస్తున్నారు కానీ వాళ్ల చేతులలో బలైపోతున్న విద్యార్థులకు మహిళలకు మాత్రం న్యాయం జరగకుండా పోతుందని పేర్కొన్నారు విద్యార్థులపై మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఎంత పెద్ద అండదండలు ఉన్న వారి పైన చర్యలు తీసుకోవాలన్నారు. హత్యాచారం చేసిన నిందితులకు వేరే వారు ఎవరు పైన అమ్మాయిలపైన మహిళలపైన అత్యాచారం చేస్తే ఈ విధంగా శిక్షలు ఉంటాయా అని తెలిసే విధంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐ కి అప్పగించిందని వారు సమగ్ర దర్యాప్తు చేసి వైద్య విద్యార్థి పై లైంగిక వేధింపులకు పాల్పడి అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని  కోరారు. అదేవిధంగా దేవుడు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మ ఇస్తారని తెలిపారు. అటువంటి పవిత్ర వృత్తిలో ఉన్న వైద్యురాలి పై అత్యాచారం చేయడమే కాకుండా హత్య చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పైగా ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఏం చేసుకుంటారో చేసుకోండంటూ నిర్లక్ష్యంగా నిందితుడు సమాధానం ఇవ్వడంపై వారు నిప్పులు చెరిగారు. ఇటువంటి వారిని బహిరంగంగా ఊరి తీయాలని లేదంటే ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంట వైద్యులు, వైద్య రంగంలోని వారికి రక్షణ లేకుండాపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.