నిత్యం టౌన్ ప్లానింగ్ స్పెషల్ డ్రైవ్..
- సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం
- 76 పెండింగ్ అనుమతుల్లో 57 క్లియర్ చేశాం
- త్వరలోనే పురసేవ పునఃప్రారంభం
- ఫోర్జరీ కేసులో చర్యలు తప్పవు
- రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
- నెల్లూరు కార్పొరేషన్ లో పెండింగ్ భవన నిర్మాణాల దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్
- మంత్రితో కలిసి పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, కమిషనర్ సూర్యతేజ
-
- అర్జీలు స్వీకరించిన మంత్రి నారాయణ
నెల్లూరు కార్పొరేషన్‌లో... నిత్యం టౌన్ ప్లానింగ్ స్పెషల్ డ్రైవ్‌ని నిర్వహిస్తామని...ఈ డ్రైవ్‌లో అన్ని అనుమతులు ఉండి జాప్యం చేస్తున్న పనులను సత్వమే పరిష్కరిస్తామని... రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో పెండింగ్ భవన నిర్మాణాల దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజలతో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు. ముందుగా మంత్రి నారాయణకి కార్పొరేషన్ అధికారులు, టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ...భవన నిర్మాణాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలను టీడీపీ నాయకులు మంత్రి దృష్టికి తీసువచ్చారు. ప్రతీ అర్జీని క్షుణంగా పరిశీలించి...త్వరతగతిన పరిష్కరించాలని న్యాయం చేయాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు.
అనంతరం...మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో టౌన్ ప్లానింగ్‌లో అనేక ఆరోపణలు వచ్చాయని...ఎంతో మంది తనకు ఫిర్యాదులు చేశారని...అందుకోసమే టౌన్ ప్లానింగ్ స్పెషల్ డ్రైవ్‌ని నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా టౌన్ ప్లానింగ్ లో భవన నిర్మాణాల అనుమతులను సులభతరం చేసేలా చర్యలు మొదలుపెట్టామని చెప్పారు. అన్ని అనుమతులు ఉండి నిర్మాణానికి నోచుకోని పెండింగ్ పనుల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు.
ఈ రోజు స్పెషల్ డ్రైవ్‌లో 76 పెండింగ్ అనుమతుల్లో 57 క్లియర్ చేశామని తెలిపారు. ప్రధానంగా
అన్ని అనుమతులు ఉండి జాప్యం చేస్తున్న పనులను సత్వమే పరిష్కరిస్తున్నామన్నారు. ఈ డ్రైవ్‌లో
రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారన్నారు. అన్నీ ఫర్‌ఫెట్‌గా ఉంటే ఎన్‌వోసీలు జారీ చేయాలని ఇప్పటికే అధికారులకి ఆదేశించడం జరిగిందన్నారు. ఎంత మేరకు వీలైతే...అన్నింటిని పెండింగ్ వాటిని పూర్తి చేయాలని సూచించారు. నెలకి ఒక్క సారి అయినా డ్రైవ్‌లో పాల్గొంటానని.. మీరొచ్చి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీల్లో ఇలాంటి డ్రైవ్‌లు నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని పేర్కొన్నారు. ఎల్లుండి విశాఖపట్నంలో టౌన్ ప్లానింగ్ పై స్పెషల్ డ్రైవ్ ఉంటుందని...అందులో కూడా పాల్గొంటున్నానన్నారు. రాష్ట్రంలో 2014 - 2017లో ఏడు లక్షల వెయ్యి ఇళ్లను మంజూరు చేశానని...అప్పుడు నేనున 5 లక్షల ఇళ్లకు అడ్మినిస్ట్రేషన్ క్లియరెన్స్ ఇచ్చానని గుర్తు చేశారు. అలాగే 4 లక్షల 64వేల ఇళ్లను టెండర్లు ఇవ్వడం జరిగిందన్నారు. అందులో తమ ప్రభుత్వం వెళ్లే సమయానికి 71 వేల ఇళ్లను పూర్తి చేశామన్నారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక...అంతా గందరగోళం చేసిందన్నారు. టిడ్కో ఇళ్లపై సీఎం దగ్గర రివ్యూ మీటింగ్ ఉందన్నారు. 2014 నుండి 19 వరకు టిడ్కో ఇళ్ల కోసం అప్లయ్ చేసుకున్న వారికందరికి ఇళ్లు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో టీడీఆర్ వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగాయన్నారు. టీడీఆర్ అవకతవకలపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కక్ష సాధింపుతో కాకుండా...ఎవరైతే తప్పు చేశారో...వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సున్నితంగా హెచ్చరించారు. కార్పొరేషన్ లో సంతకాల ఫోర్జరీ విషయాన్ని
రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్ది నా దృష్టికి తీసుకొచ్చారన్నారు. అప్పటికప్పుడే ఎస్పీని, అధికారుల్ని ఆదేశించి విచారణ చేపట్టామన్నారు. ఈ విషయంలో ఎవరిని వదిలే ప్రసక్తే లేదని...ఎంతటి వారికైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. 2014లోనే దేశంలో మొదటి సారి అన్ లైన్ వ్యవస్థ తీసుకొచ్చింది టిడిపి ప్రభుత్వం అని తెలిపారు. టౌన్ ప్లానింగ్ లో డిపార్ట్మెంటల్ జాప్యం ఉందని... ఇక అటువంటి పరిస్థితి ఉండదన్నారు. త్వరలోనే పురసేవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.