*పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్..*
మాజీ మంత్రి పేర్ని నానికి ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గు లేకుండా తమ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. వైసీపీ పాలనలో మరుగునపడ్డ పట్టిసీమను ప్రారంభించి డెల్టాకు నీళ్లు ఇచ్చామన్నారు.