*తిరుపతి జిల్లా..గూడూరు*
*💥రెచ్చిపోతున్న మానవ మృగాలు బలవుతున్న చిన్నారులు,మహిళలు💥*
*💥గూడూరు పట్టణంలో దారుణం, ఇంటర్ చదివే విద్యార్థిని రౌడీషీటర్ అత్యాచారం*💥
*👉కాలేజీకి వెళ్లే విద్యార్థినిని వినయ్ అనే రౌడీషీటర్ కత్తితో బెదిరించి బలవంతంగా ఆటో లో గాంధీనగర్ అనే ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం ...*
*👉రౌడీ షీటర్ వినయ్ గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తింపు...*
*👉అవమానం తో సూపర్ వాస్మల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన బాలిక...*
బాలికకు మొదట గూడూర్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స, అనంతరం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం, పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరులోని ఆసుపత్రికి తరలింపు...
తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలంలో 8 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్య ఘటన మరువకముందే అదే జిల్లాలో మరో ఘటనతో భయాందోళనలో జిల్లా ప్రజలు...
తిరుపతి జిల్లా గూడూరు రెండో పట్టణ పరిధిలో నివసించే బాలిక కాలేజీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు రాగా గూడూరు పట్టణం అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ వినయ్ బాలికకు కత్తి చూపు బెదిరించి ఆటోలో కిడ్నాప్ చేసి గూడూరు లోని గాంధీనగర్ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి సాయంత్రం తిరిగి ఆటోలో బాలికను రెండో పట్టణ పరిధిలో వదిలేసి వెళ్లిపోగా ఈ అవమానంతో బాలిక సూపర్ వాస్మలు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు వైద్యం కోసం గూడూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు నగరంలోని మరో ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటనపై రెండవ పట్టణ పరిధిలో కేసు నమోదయింది పోలీసులు దర్యాప్తు చేపట్టారు...