*విద్యాభివృద్ధికి కృషి చేస్తే వారిని గుర్తించుకుంటారు*
*పాఠశాల అభివృద్ధి దాత*
*పేదల పెన్నిధి డాక్టర్ శరత్ గిరి రెడ్డి*
విద్యార్థుల అభివృద్ధికి కృషి చేసి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దితే గ్రామాలలో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు గుర్తుంచుకుంటారని గుల్లవాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల అభివృద్ధి దాత పేదల పెన్నిధి డాక్టర్ శరత్ గిరి రెడ్డిగారు పేర్కొన్నారు గుల్లవాండ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు సావిత్రమ్మ పదవీ విరమణ సందర్భంగా స్కూల్ కాంప్లెక్స్ సుండుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జయన్న అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి డాక్టర్ ఎర్రపురెడ్డి శరత్ గిరి రెడ్డి గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత గ్రామంలో ఉన్న పాఠశాలను అభివృద్ధి పరిచే అందుకోసం అభివృద్ధి పనులు చేపట్టామన్నారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి వెంకటేష్ నాయక్ పాఠశాలలో ఫ్లోర్ దెబ్బతినిందని ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన మరమ్మత్తులు చేయిస్తానని హామీ ఇచ్చారు అనంతరం పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షుడు అన్నమయ్య జిల్లా క్రమశిక్షణ కమిటీ జిల్లా సభ్యులు శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి వన్నెతెచ్చిన వారు ఎవరంటే పదవీ విరమణ పొందిన సావిత్రమ్మ వారి భర్త చెన్నకేశవులు అని పేర్కొన్నారు సావిత్రమ్మ సెలవులు ఉన్న వాటిని పెట్టకుండా ఉపాధ్యాయ వృత్తికి పరిమితమై విద్యార్థుల అభివృద్ధి కోసం కృషిచేసిన ఘనత ఆమెదేనని పేర్కొన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ నాయకులు కొంత చేసి గోరంత చూపుతారని కానీ ఈ పాఠశాలను ఎంతో అభివృద్ధి చేసిన డాక్టర్ శరత్ గిరి రెడ్డిగారు లాంటివారు గ్రామాలలో ఉంటే ప్రతి గ్రామానికి పాఠశాల అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధ్యాయుల బాధ్యత పెరిగి విద్యార్థు లలో మంచి మార్పు వచ్చి ప్రయోజకులవుతారని తెలియజేశారు అనంతరం ఎంఈఓ లో వెంకటేష్ నాయక్ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ పాఠశాలలో దాదాపు 60 మంది విద్యార్థులు ఉన్నారని వారికి ఇద్దరే ఉపాధ్యాయ లు ఉండి విద్యాబోధన చేస్తున్నారని ఇంకో ఉపాద్యాయుని నియమించేందుకు కోసం తాము చర్యలు తీసుకున్నామని అయితే ఈ పాఠశాల అభివృద్ధికి డాక్టర్ శరత్ గిరి రెడ్డి ఎంత కృషి చేశారో ఉపాధ్యాయులు సైతం అంత కృషి చేసి కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను అభివృద్ధి చేశారని తెలిపారు అనంతరం వివిధ మండలాల ఎంఈఓ లు ప్రధానోపాధ్యాయులు సావిత్రమ్మ విద్యార్థుల పట్ల చేసిన సేవల గురించి కొనియాడారు అనంతరం సావిత్రమ్మ చెన్నకేశవుల దంపతులను పూలమాలలు దుశ్యాలవల తోపాటు మెమెంటోలు గిఫ్ట్లు అందజేసి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎస్టియు జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి వివిధ మండలాల ఎంఈఓ లు శ్రీనివాసరాజు చెన్నకేశవులు సంబేపల్లి హెచ్ఎం నర్సింహారెడ్డి రిటైర్డ్ ఎడి కేశవులు ఉపాధ్యాయ సంఘం నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి నాగరాజు నాయక్ సిద్దు నాయక్ వెంకటరామిరెడ్డి పాఠశాల ఉపాధ్యాయురాcyలు కృష్ణవేణి పాఠశాల కమిటీ చైర్మన్ రాచరాయుడు వారి బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యులు ఘనంగా సన్మాన కార్యక్రమం చేపట్టారు.