విజయనగరం జిల్లా...
బొబ్బిలి...
రామభద్రపురం మండలం జీలుగువలస గిరిజన గ్రామంలో సభ్యసమాజం తలదించుకునే సంఘట శనివారం చోటు చేసుకుంది. బొబ్బిలి డిఎస్పి పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ జీలుగువలసలో ఐదు నెలల చంటి పాపపై అదే గ్రామానికి చెందిన బోయిన ఎరకన్నదొర అత్యాచారం చేశాడు. చంటిపాపను ఉయ్యాలలో పడకుండా పెట్టి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు తల్లి వెళ్లింది. తల్లి ఇంటిలోకి వెళ్తుండగా ఎరకన్నదొర బయటకు రావడంతో చంటిపాపను చూడగా తీవ్ర రక్తస్రావం కావడంతో పోలీసులకు పిర్యాదు చేశారు. చంటిపాపను బాడంగి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడుని అదుపులోకి తీసుకుని ఎస్ఐ జ్ఞానప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.