శ్రామికుని ఆరడుగుల కాంపౌండ్ గోడను కూల్చిన రాయచోటి తాహసీల్దార్

 








కొసరును వదిలి పిసురును కూలగొట్టినట్లు శ్రామికుని ఆరడుగుల కాంపౌండ్ గోడను కూల్చిన రాయచోటి తాహసీల్దార్ 


జగనన్న కాలనీలలో నిరుపేదలకు ఇచ్చిన స్థలాలను అధికారుల మాటున లక్షలు విలువచేసే జాగాలను కాజేసి గుట్టు చప్పుడు కాకుండా బంగ్లాలను కట్టుకుని దర్జాగా తీరుగుతున్న" ఆల్ "పార్టీ దొరలను వదిలి  ఒకిటిన్నర సెంటు గవర్నమెంట్ ఇచ్చిన స్థలం లో ఇల్లు నిర్మించుకుని జీవిస్తున్న ఒక శ్రామికుని ఇంటిముందున్న అరడుగుల గోడను రాయచోటి తహసీల్దార్ ఏమాత్రం కరుణ లేకుండా కూలగొట్టడం విమర్శలకు దారితీస్తోంది. వివరాలలోకి వెళితే రాయచోటి -సుండుపల్లి రోడ్డులో ని మోడల్ స్కూల్ ఎదురుగా 700 ఇండ్లతో నిర్మితమైన జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకుని జీవనోపాది కోసం 

రిగ్గు బండి పెట్టుకుని  వసంత్ ప్రతాప్ రెడ్డి జీవిస్తూ ఉండాడు.ఈ కాలనీ ఏర్పాటుకోసం తన రిగ్గు బండితో పని చేసిన 3 లక్షలు రూపాయిలు ఇప్పటికీ అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదని కనిపించిన అధికారికల్లా ప్రతాప్ రెడ్డి మోరపెట్టుకుంటూ ఉండాడు.కాలనీలో ప్రజలకు కానీ, రోడ్లకు గాని ఎలాంటి అడ్డం లేని ఆరడుగుల కాలి జాగా తన ఇంటిముందర ఉండగా పని ముట్లు, కోళ్ల ను సంరక్షించు కోవడానికి గోడ నిర్మించు కున్నానని ప్రతాప్ రెడ్డి తెలిపారు. మొదట అయిదు సంవత్సరాలు వైసిపి పార్టీ లో ఉండి ఎన్నికల కంటే ముందు టిడిపి లోకి వచ్చిన వారు వారి పెత్తనం కోసం అధికారులకు చాడీలు చెప్పి నన్ను బలిచేశారని ప్రతాప్ రెడ్డి వాపోయాడు. ఇదే జగనన్న కాలానీలో అధికారుల అండదండలతో 70/శాతం కబ్జా చేశారని ఈ విషయం గురించి రాయచోటి తహసీల్దార్ విచారించకుండా కాలనీ ఏర్పాటు కోసం రిగ్గు బండితో పని చేసిన 3 లక్షలు డబ్బులు నష్ట పోయిన నన్ను అవమాన పరుస్తూ నా ఇంటి  గోడలు కూల్చా రని  ఈ విషయాన్ని గొరవ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ద్రుష్టి కి తీసుకు పోతానని ప్రతాప్ రెడ్డి తెలిపారు