ముద్దాయికి 1సం. జైలు శిక్ష విధించిన

 



*2014సం. లోని నమోదైన SC/ST కేసులో ముద్దాయికి 1సం. జైలు శిక్ష విధించిన చిత్తూరు 1వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్*


*ఈ దినం అనగా 09-07-2024 వ తేదీన 2014వ సం. లో బంగారుపాళ్యం మండలంలో మధు అనే ముద్దయిపై నమోదు అయిన SC/ST కేసులో 1సం. జైలు శిక్ష మరియు 200రూ.ల జరిమానా విధించిన చిత్తూరు 1వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జ్ శ్రీ ఎస్.రమేష్*


*కేసు వివరాలు :*


 చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం నల్లంగాడు ఆదిఆంధ్రావాడ గ్రామంలో నివాసముంటున్న దామోదరం అతని భార్య దేవి లతో ముద్దాయి మధు కు పాత గొడవలు ఉండేవి. 30-08-2014వ తేదీన మధు మద్యం సేవించి దేవి వాళ్ళ ఇంటి వద్దకు వెళ్లి గొడవ పెట్టుకొని వాళ్ళను వారి కులము పేరుతో అసభ్యంగా దూషించి దామోదరం, దేవిలను చొప్పులతో కొట్టి వారిని చంపుతామని బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దీని పై దేవి బంగారుపాలెం పోలీస్ స్టేషన్ నందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు Cr.NO:221/2014 u/s 355, 323, 506 IPC &  Sec 3(1)(X) SC/ST (POA) act కింద అప్పటి పలమనేరు సబ్ డివిజన్ డి.ఎస్పీ శ్రీ శంకర్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించి ముద్దాయి మధు ను అరెస్ట్ చేసి దర్యాప్తు నిమిత్తం రిమాండ్ కు పంపించారు.


  సదరు కేసు విచారణ పూర్తి అయి ఈ దినం అనగా 09-07-2024 న తీర్పు ఇవ్వడం జరిగింది. సదరు తీర్పులో బాగంగా ముద్దాయి మధు కు 1వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జ్ శ్రీఎస్.రమేష్ గారు ముద్దాయికి 1సం. జైలు శిక్ష మరియు 200రూ. జరిమానా విధిస్తు తీర్పును ఇచ్చారు.


*ముద్దాయి వివరాలు :*

మధు, 42 సం., నల్లంగాడు గ్రామం, బంగారుపాలెం మండలం, చిత్తూరు జిల్లా.


సదరు కేసులో ముద్దాయికి శిక్ష పడుటకు కృషి చేసిన అప్పటి పలమనేరు డి.ఎస్పీ శ్రీ శంకర్, కోర్ట్ మానిటరింగ్ సెల్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.బాలయ్య గారు, కోర్టుకు సాక్షాలను సకాలంలో హాజరు పరచిన కోర్ట్ కానిస్టేబుల్ శ్రీ చిరంజీవి మరియు కోర్ట్ మానిటరింగ్ సెల్ సిబ్బందిని చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు,IPS గారు ప్రత్యేకంగా అభినందించారు.