*టీడీపీ దాడులు చేస్తోంది.. రక్షించండి: YS జగన్*
ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని జగన్ ట్వీట్ చేశారు. 'సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది.
అధికార పార్టీ ఒత్తిళ్లకు పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారింది. ఐదేళ్లుగా పటిష్ఠంగా ఉన్న శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలి' అని కోరారు.