No title

 Press Note



1. 04.06.2024 వ తేదీన జరుగు 2024 - సాధారణ ఎన్నికల కౌంటింగ్ సందర్బంగా టి.సుండుపల్లి మండలం నందు 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున, టి.సుండుపల్లి పోలీస్ వారి ఆదేశాల మేరకు ఎన్నికల ఫలితాల సమయంలో ర్యాలీలు నిర్వహించడం, గుంపులు గుంపులుగా ఉండడం, పటాసులు కాల్చడం, డప్పులు వాయించడం వంటి పనులు చేయరాదు. 

2. టి.సుండుపల్లి మండలానికి సంబందించిన ప్రజలు అవసరమైతే తప్ప అనవసరంగా రాయచోటిలో కౌంటింగ్ ప్రదేశానికి వెళ్ళరాదు. 

3. పోలీస్ వారి నిబందనలను ఉల్లంఘించి శాంతి భద్రతలకు విఘాతం కలుగచేసి, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడిన యెడల వారిపైన కటినతరంగా చట్టపరమైన చర్యలకు భాద్యత వహించవలసి వస్తుందని ఈదినము అనగా 02.06.2024 వ తేదీన టి.సుండుపల్లి మండలం నందు కొన్ని గ్రామాలలో కేంద్ర భాలగాలతోటి ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. 

కావున సుండుపల్లి మండల ప్రజలు పోలీస్ వారికి  సహకరించి శాంతియుతంగా ప్రజలు ఎవరికీ వారు వారి ఇంటివద్దనే ఉండవలసినదిగా మనవి. 

    ఇట్లు 

సబ్-ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్     టి.సుండుపల్లి పి.యస్.