దేశవ్యాప్తంగా ఈవీఎంల( EVM ) పనితీరుపై తీవ్రంగా చర్చ

 


దేశవ్యాప్తంగా ఈవీఎంల( EVM ) పనితీరుపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. వివిధ రాజకీయ పార్టీలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.


లోక్ సభ ఎన్నికల్లో ఈవీయంలను ట్యాంపరింగ్ చేశారని, వాటిలో రికార్డ్ అయిన ఫలితాలను తారుమారు చేశారని అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా 140 కి పైగా లోక్ సభ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా కంటే అధికంగా ఓట్లు పోల్ అవ్వడాన్ని దీనికి నిదర్శనంగా చూపిస్తున్నాయి. మేధావులు సైతం ఈవీఎం ల పనితీరు పై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు బహిరంగంగానే ఈవీఎం ల పనితీరుపై మాట్లాడారు.


వీటిపై న్యాయపోరాటం చేస్తామని ప్రశాంత్ భూషణ్ ప్రకటించారు. ఇక టెస్లా అధినేత ఎలెన్ మాస్క్ వంటి వారు ఈవీఎంల పనితీరు పై అనుమానాలు వ్యక్తం చేయడం వంటివి జరిగాయి.


ఏపీలో వెలువడిన ఫలితాల పైనా, తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను, 175 స్థానాలను గెలుచుకుంటామనే ధీమాతో ఉంటూ వచ్చిన వైసీపీ  ఈ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడం, టిడిపి అభ్యర్థులు గెలిచిన చోట్ల చాలావరకు భారీ మెజార్టీలు రావడం, టిడిపి, బిజెపి, జనసేన బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ ఆ కూటమి అభ్యర్థులు విజయం సాధించడం వంటి వాటి పైన వైసిపి అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అనేక నియోజకవర్గల్లో వైసీపీ అభ్యర్థులు ఓటమి చెందారు.


120 కి పైగా అసెంబ్లీ స్థానాల్లో టిడిపి అభ్యర్థులకు 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీ రావడం వంటివి అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసినా, ఈ స్థాయిలో ఓటమి ఎదురు కావడాన్ని వైసిపి అధినేత జగన్  జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్ సభ నియోజకవర్గంలో షిండే వర్గానికి చెందిన శివసేన అభ్యర్థి రవీంద్ర   వైఖరి వ్యవహారం పైన దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తాజాగా ఏవీఎంల పనితీరుపై వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.


ఈవీఎం ల పనితీరుపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వత ఈవీఎంలపై జగన్ మొదటిసారిగా స్పందించారు. న్యాయం జరగడం మాత్రమే కాదు అది జరిగినట్టు కనిపించాల్సిన అవసరం కూడా ఉందంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఈ విధంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే అది బలంగా కనిపించాల్సిందేనంటూ జగన్ ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలలో కూడా ఎన్నికల ప్రక్రియలో పేపర్ బ్యాలెట్ లను ఉపయోగిస్తున్నారని, అలాంటి దేశాల్లో ఈవీఎంలను వినియోగించడం లేదని జగన్ గుర్తు చేశారు. ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్ లను ఉపగించాలని జగన్ అభిప్రాయపడ్డారు.