ఆపద్ధర్మ సీఎం అధికారాలేమిటి ? జగన్ అధికార యంత్రాగంపై అప్పుడే విమర్శలు దేనికి సంకేతం ?
ఏపీలో ఇప్పటికీ కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు. ఆపద్ధర్మ సీఎంగా జగనే కొనసాగుతున్నారు. కానీ ఆయన ప్రభుత్వం యంత్రాంగంపై అప్పుడే విమర్శలు చేస్తున్నారు. అసలు ఆపద్ఘర్మ సీఎం అధికారాలేమిటి ?
ఏపీలో ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని పోలీసులు నిస్తేజమయ్యారని ఆపద్ధర్మ సీఎం జగన్ ఆరోపిస్తున్నారు. తమ పార్టీ నేతల్ని గవర్నర్ వద్దకు పంపించి ఫిర్యాదులు కూడా చేశారు. నిజానికి ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఆపద్ధర్మ సీఎంగా ఆయనే ఉన్నారు. అయినా ఆయన ఆరోపణలు చేయడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. నిజానికి కేర్ టేకర్ సీఎంగా ఉంటే.. కొన్ని విషయాల్లో మినహా పవర్ మామూలుగా సీఎంగా ఉన్నట్లే ఉంటుంది.
రెండు సందర్భాల్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రులు ఉండే అవకాశం
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, సీఎం రెండు సందర్భాల్లో ఆపద్ధర్మ సీఎంగా మారాల్సి ఉంది. అందులో మొదటిది ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు.. రెండోది తాను రాజీనామా చేసినప్పుడు.. తర్వాత ప్రభత్వం ఏర్పడే వరకూ ఆపద్ధర్మ సీఎంగా ఉండటం. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండి జగన్ ఆపద్ధర్మ సీఎంగానే ఉన్నారు. కానీ పవర్స్ లో మాత్రం తేడాలు వచ్చాయి.
ఎన్నికల కోడ్ లేకపోతే సీఎం - ఆపద్ధర్మ సీఎం ఒకటే
ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే సీఎం ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. అంటే..దాదాపు పాలన అంతా.. అంతర్గతంగా జరిగిపోవాలి కానీ.. పబ్లిసిటీ రాకూడదు. కొత్త అసెంబ్లీలు, పార్లమెంట్ ఏర్పాటు అయిందని రాష్ట్రపతి, గవర్నర్లకు ఈసీ నివేదికలు సమర్పించిన తర్వాత ఈసీ కోడ్ ను ఎత్తివేస్తుంది. అప్పటి వరకూ రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పక పాటించాల్సి ఉంటుంది. ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. ఇప్పుడు కోడ్ కూడా ఎత్తివేశారు. చంద్రబాబు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. అందకే జగన్ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్నారు. కోడ్ లేకపోయినా ఆపద్ధర్మ సీఎంగా ఉన్నారంటే... ఆయనకు పూర్తి స్థాయి అధికారాలు ఉన్నట్లే.
ఓడిపోవడంతో జగన్ మాటల్ని వినని అధికారులు
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. జగన్ కేర్ టేకర్ సీఎం అయినా.. ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుు చంద్రబాబు ప్రమాణం చేస్తారు. ఇలాంటి సమయంలో కేర్ టేకర్ సీఎం అని అధికారులు జగన్ మాటల్ని వినలేరు. అలా వింటే.. బాధ్యతలు చేపట్టబోయే సీఎంకు కోపం వస్తుంది. అందుకే జగన్ కేర్ టేకర్ సీఎంగా ఉన్నప్పటికీ అధికారులు ఎవరూ ఆయనకు రిపోర్టు చేయడం లేదు. చంద్రబాబును కలుస్తున్నారు. ఆయన సూచనలు, సలహాలు మేరకు అధికారుల్ని బదిలీలు కూడా చేస్తున్నారు. నిజానికి చంద్రబాబు నేరుగా ఆదేసించే అధికారం లేదు. కానీ ఆయన బాధ్యతలు చేపట్టడం వందకు వంద శాతం ఖాయం కాబట్టి అధికారులు చ చేయక తప్పడం లేదు.
అంటే కేర్ టేకర్ సీఎం అనే హోదాకు రెండు సందర్భాలను బట్టి అధికారాలు మారిపోతాయని అనుకోవచ్చు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఒకలా.. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ కేర్ టేకర్ సీఎంగా ఉండటం మరోలా ఉంటుంది. మొదటి విధానంలో అంతర్గతంగా ప్రభుత్వాన్ని నడుపుకోవచ్చు. రెండో విధానం అయితే ఎవరూ పట్టించుకోరు. కొత్తగా ప్రమాణం చోయబోయే సీఎం ఆదేశాలనే పాటిస్తారు.