బొబ్బిలి ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్న శ్రీ ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు గారికి అభినందనలు



బొబ్బిలి ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్న  శ్రీ ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు గారికి అభినందనలు - లోక్ సత్తా పార్టీ...

           2024 సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్న శ్రీ ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు గారికి లోక్ సత్తా పార్టీ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు, ప్రజా సంకల్ప వేదిక-


సమాచార హక్కు చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి సురేష్ అన్నారు. వారు మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారికి ఏ సహాయం కావాలన్నా చేస్తూ నేను ఉన్నాను అని భరోసా ఇచ్చే అర్.వి.ఎస్.కె.కె. రంగారావు గారు అయితే మన బొబ్బిలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే ఆశతో నియోజకవర్గ ప్రజలు ఆయనని భారీ మెజారిటీతో గెలిపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఆయన తన వంతు కృషి చెయ్యాలని లోక్ సత్తా పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. 

             గత ఇరవై సంవత్సరాలుగా నియోజకవర్గంలోని సమస్యలు అలాగే ఉన్నాయి. జనాభా పెరుగుదల స్థాయికి తగ్గ మౌళిక సదుపాయాలు లేవు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేను ముఖ్యంగా ప్రస్థావించినవి ఏవనగా మీరు ప్రతి పక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసినవి, మద్దతు తెలిపిన సమస్యలు. అవి  బొబ్బిలి శాఖా గ్రంథాలయ భవనాన్ని మరమ్మత్తులు చేస్తాం అని గత ప్రభుత్వం ఆ గ్రంథాలయ భవనం ఖాళీ చేయించి ఇంత వరకూ దానిని బాగు చెయ్య లేదు. తమరు  దృష్టి పెట్టి ఆ భవనం తొందరగా మరమ్మత్తులు చేయించి పాఠకులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చెయ్యాలి. అలాగే ఆ గ్రంథాలయానికి కొత్త భవనం మంజూరు చెయ్యవలసినదిగా మా విజ్ఞప్తి. దాడితల్లి గుడి నుండి గొల్ల వీథి మీదుగా పూల్ భాగ్- రాజా కాలేజి రహదారి మంచిగా వెయ్యాలని. పారాది వంతెన పనులు తొందరగా ప్రారంభించేటట్టు చెయ్యమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వర్షాలు పడితే వంతెన వద్ద ఏర్పాటు చేసిన అనుసంధాన రహదారి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో బొబ్బిలిలో చాలా చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గరయ్యాయి. మీరు ఒక సారి పరిశీలించి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని మా విన్నపం. ఈ సమస్యలపై మీరు దృష్టి పెట్టి పరిష్కరించేందుకు తమరు కృషి చెయ్యాలని లోక్ సత్తా పార్టీ తరపున మరొక సారి విజ్ఞప్తి చేస్తున్నాం.