*అనకాపల్లి జిల్లా పోలీసు*
*పోలీసు సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు “పోలీస్ గ్రీవెన్స్ డే” నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్.,గారు.*
*అనకాపల్లి, జూన్ 28 :* జిల్లా పోలీసు సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్., గారు జిల్లా పోలీసు కార్యాలయంలో వినతులు స్వీకరించేందుకు ఈ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ రోజు జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో 18 మంది పోలీసు సిబ్బంది, జిల్లా పోలీసు కార్యాలయం నందు హాజరు అయి, వారి యొక్క అనారోగ్య, ఉద్యోగ, వ్యక్తిగత సమస్యలను జిల్లా ఎస్పీ గారికి విన్నవించుకోగా, ఎస్పీ గారు వారి విన్నపములను పరిశీలించి, సానుకూలంగా స్పందించి, అర్హమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ బి.విజయభాస్కర్ పాల్గొన్నారు.
*జిల్లా పోలీసు కార్యాలయం,* *అనకాపల్లి.*