సెంట్రీ డ్యూటీలో మహిళా కానిస్టేబుల్ మృతి

 *సెంట్రీ డ్యూటీలో మహిళా కానిస్టేబుల్ మృతి*




*రాయచోటి*


అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి(26) అనే మహిళా కానిస్టేబుల్ గన్నుతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే గన్నుతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుందా లేక గన్ను మిస్ ఫైర్ అయ్యి మృతి చెందిందానే విషయము తెలియాల్సి ఉంది.భర్త పేరు దస్తగిరి ఆయన సొంత ఊరు మదనపల్లి.వేదవతి సొంత ఊరు పుంగనూరు దగ్గర బింగానిపల్లె.దస్తగిరి పుంగనూరులో పోలీస్ అకాడమీ కోచింగ్ సెంటర్ లో ప్యాకల్టీగా పనిచేస్తూ అక్కడ వేదవతి ట్రైనింగ్ తీసుకునే సమయంలో ఇద్దరు ప్రేమించుకుని 2016 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.వేదవతి చిత్తూరులో కానిస్టేబుల్ గా పనిచేస్తూ సంవత్సర క్రితం బదిలీపై అన్నమయ్య జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చింది. ప్రస్తుతం దస్తగిరి తో కలిసి వేదవతి రాయచోటి పట్టణంలోని రాజీవ్ స్వగృహకు పక్కనగల ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటోంది.ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి గన్ను తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుందా లేక గన్ మిస్సయిర్ అయి మృతి చెందింది అనే విషయం తెలియాల్సి ఉంది.ఈ మేరకు డిఎస్పి రామచంద్రరావుఅర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేదవతి మృతదేహాన్ని రాయచోటి ఏరియా ఆసుపత్రికి తరలించారు.