మత్తు పదార్థాలు బారిన పడవద్దు యువత భవిష్యత్తు చేయి జార్చుకోవద్దు

 

మత్తు పదార్థాలు బారిన పడవద్దు యువత భవిష్యత్తు చేయి జార్చుకోవద్దు అనే ఉద్దేశంతో పండగలు, ఫంక్షన్ లో సైతం వదలకుండా విస్తృతంగా మత్తు పదార్థాల నిర్మూలలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. గోపాలపట్నం ఎస్ ఐ రామకృష్ణ. మంగళవారం 89వ వార్డు చంద్ర నగర్ పరదేశమ్మ జాతర సందర్భంగా.అధిక సంఖ్యలో యువత హాజరవుతున్న సమయంలో గంజాయి మత్తు పదార్థాలు వాడవద్దు అది వాడితే మీ భవిష్యత్తు చిన్నాభిన్నమవుతుంది అంటూ.వాటికి అలవాటు పడి అనేక దొంగతనాలకు, దౌర్జన్యాలు చేసేందుకు పాల్పడతారు.మీ మతిస్థిమితం మీ అదుపులో ఉండదు అంటూ పలు అంశాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.మీరు నివసిస్తున్న ప్రాంతంలో మీకు కనబడిన ప్రదేశాల్లో గాని ఎవరైనా గంజాయి సేవించిన లేదంటే విక్రయించిన మాకు సమాచారం ఇవ్వండి అని తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.