శాసనమండలిలో వైసీపీ బలం ఎంతంటే?

 



శాసనమండలిలో వైసీపీ బలం ఎంతంటే?


విజయవాడ :


అసెంబ్లీలో 11 సీట్లతో బలం లేని వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయినా,  శాసనమండలిలో బలంగా పోరాడాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వైఎస్ జగన్ ఆ పార్టీ ఎమ్మెల్సీలకు సైతం దిశానిర్దేశం

చేశారు. 


అయితే శాసనమండలిలో బలాబలాలు చూస్తే వైసీపీకి ఎక్కువమంది సభ్యులున్నారు.


మొత్తంగా శాసన మండలిలో మొత్తం 58 సీట్లకు గాను వైసిపికి 38 మంది(8 మంది నామినేటెడ్ సభ్యులతో కలిపి) ఎమ్మెల్సీలున్నారు. TDP నుంచి 8 మంది, నలుగురు ఇండిపెండెంట్లు, PDF నుంచి ఇద్దరు సభ్యులున్నారు. ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి.