జగన్ ఇంటి వద్ద భారీగా ప్రైవేట్ సెక్యూరిటీ
AP: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం వద్ద భారీగా ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారు. జగన్, ఆయన ఇంటి భద్రత కోసం ఒక ప్రైవేట్ ఏజెన్సీ
నుంచి దాదాపు 30 మందిని నియమించుకున్నట్లు తెలుస్తోంది. భద్రత కోసం ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి
చేయకుండా సొంత ఖర్చుతో వీరి నియామకం చేపట్టినట్లు సమాచారం. జగన్ ఇంట్లోకి సెక్యూరిటీ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.