మాదక ద్రవ్యాలు లేని జిల్లాగా విశాఖను ...

 మధురవాడ 






మాదక ద్రవ్యాలు లేని జిల్లాగా విశాఖను  తీర్చిదిద్ధేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించాలని జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప అన్నారు..  ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధి  క్రికెట్ స్టేడియం వద్ద ఉన్న వి కన్వెక్షన్ హాల్లో  నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువత  మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా మాదక దవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుందన్నారు. వంద రోజుల్లో విశాఖ జిల్లాలో గంజాయిని నిర్మించినడమే ప్రధాన లక్ష్యం అన్నారు. విశాఖలో బైక్ రేసింగ్ లు ఎక్కువగా జరుగుతుండడంతో ద్రుష్టి పెట్టి సుమారు 80 నుంచి 90 బైక్ లను సీజ్  చేశామన్నారు.ప్రశాంతమైన విశాఖ ఇలా ఎందుకు జరిగిందో అని ఆరా తీస్తే యువత గంజాయికి అలవాటు పడుతున్నారని తెలిసిందన్నారు మాదక ద్రవ్యాలకు బానిసై యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. మాదక ద్రవ్యాల అమ్మకం, రవాణా, వాటి మూలాలు గుర్తించి ఉక్కు పాదం మోపుతామన్నారు. మాదక ద్రవ్యాలు అమ్మినా, సరఫరా చేసినా పోలీసులకు  సమాచారం అందించాలని కోరారు. డ్రగ్స్ నిర్మూలనను తమ బాధ్యతగా భావించి చదువుకునే యువత మత్తుకు బానిస కావద్దని పిలుపునిచ్చారు. అలాగే యువత సైబర్ మోసాల బారిన పడుతున్నారని అన్నారు.. ఫ్రీ వైఫై లో కూడా ఎక్కువ స్కాం లు జరుగుతున్నాయనీ ,ఫ్రీ వైఫై ద్వారా ఆన్లైన్ ట్రాంజక్షన్లు చేయొద్దని సూచించారు.. కాంబోడియా కేంద్రంగా  ఇలాంటి స్కాం చేస్తున్న వారిని గుర్తించి బాధితులను ఇక్కడికి తీసుకొచ్చామన్నారు. సోషల్ మీడియా తో చాలా జాగ్రత్త తో ఉండాలన్నారు.  నార్త్ ఏసీపీ సునీల్ కుమార్ మాట్లాడుతూ విశాఖను  డ్రగ్ ఫ్రీ ఆంధ్ర గా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందన్నారు. దానికి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఎంతో అవసరం అన్నారు. ఎక్కువ శాతం విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారనీ,గంజాయినీ సరదాగా లైఫ్ లో అలవాటు చేసుకోవడంతో . అది వ్యాసనంలా మారిపోతుందన్నారు. గత కొద్ది రోజుల క్రితం తాను  ఓ ప్రైవేట్ భవనంలో తనిఖీలు చేయగా భవనం మొత్తం కూడా గంజాయి దొరికిందని చెప్పారు. విలాసవంతమైన జీవితం   కోసం విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలుగా అవుతున్నారన్నారు.  డ్రగ్స్ బారిన పడకుండా యువతకు కుటుంబ సభ్యులు అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ ఫక్కీరప్ప,డీసీపీ 1 లక్ష్మి నారాయణ,నార్త్ ఏసీపి సునీల్,పిఎంపాలెం సీఐ రామకృష్ణ ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.