నెల్లూరు ఉమ్మడి జిల్లా సూళ్లూరుపేట బాబూజీ కాలనీ పరిధిలో రెండు రోజులు క్రితం తుపాకుల చంద్ర అనే హ్యాండీక్యాప్ అతను ఆటోని జీవనాధారంగా పెట్టుకొని చిన్నచిన్న లైట్లు వేసుకుంటూ జీవనం సాగిస్తుంన్నాడు.
అతని వద్దకు యలమల గణేష్ 19 సంవత్సరాల కుర్రాడు దగ్గరలోని వాటర్ ఫాల్స్ కి వెళ్లాలని అతని ఆటోని బాడుకు తీసుకుని పోవడానికి 500 రూపాయలు డీజిల్ కి ఇవ్వగా 2000 రూపాయలు బాడుగ మాట్లాడుకుని మిగతా 1500 బాడుగ వెళ్లి వచ్చినాక ఇస్తాను అని చెప్పాడు.
ఒక రోజు గడిపిన తర్వాత చంద్ర అనే అతను ఫోన్ చేసి అడగగా అతన్ని కులం పేరుతో దుర్భాషలాడి అతను ఎస్టీ కులానికి చెందిన వాడు కాబట్టి కులం పేరుతో దుర్భాషలాడి రారా చూసుకుందాం నీకు రెండు కాళ్లు లేవు నువ్వు ఎస్టి కులానికి చెందిన వాడివి వస్తున్నా ఉండు అని చెప్పి ఇంటి వద్దకు వస్తే చేతులు రెండు ఇరచేస్తాను నువ్వు ఎంత నీ బతుకెంతరా అని ఇంటికి వచ్చి అతన్ని కొట్టి అడ్డం వచ్చినా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యని కడుపుతో ఉన్నది అని కనీసం కనికరం లేకుండా అమ్మాయిని కూడా కొట్టి వాళ్ళ అమ్మను కొట్టి అతను ఆటో అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేసి నీకు దిక్కున చోటు చెప్పుకోరా నేను ఏం చేసినా నన్ను తీసుకొచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఎవరికి భయపడను ఆల్రెడీ నేను జైలుకు పోయి వచ్చినా అనీ వాల్లను భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి వారి అమ్మ ధనలక్ష్మి అనే ఆమెని సపోర్ట్ చూసుకొని ఇద్దరు వచ్చి వారిని ఇబ్బంది పెట్టి వెళ్ళారు.
వీళ్ళు అందరూ గ్రామస్తులుతో కలసి సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్కు వచ్చి కేసు పెట్టగా ఆ కేసుని అట్రాసిటీ కేసుగా పరిగణలో తీసుకొని కేసు నమోదు చేశారు.
డిఎస్పి విచారంలో ఈ కేసు ఉంది. ఈ సంఘటనకి గ్రామస్తులు అందరూ స్పందించి ఆ అబ్బాయికి న్యాయం చేయాలని వికేసి పార్టీ తరపు నుంచి చెంగయ్య గురుమూర్తి అనే ఇద్దరు పెద్దలు కూడా వాళ్ళకి సపోర్ట్ గా నిలబడ్డారు. ఈ సంఘటన జరిగినప్పుడు నుంచి అతను ఆటో తిరగక అతను ఎటువంటి ఉపాధి లేకుండా వారి బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు ఆకలితో చాలా కష్టాలు పడుతూ ఉన్నారు బాబూజీ కాలనీ కాపరస్తుడు శ్యాం సుందర్ అతను సోషల్ గా అందరికీ సాయపడే వ్యక్తి ఎవరికి ఏ కష్టం వచ్చిన వారిని అక్కున చేర్చుకుని వాళ్ళ తరఫున అండగా ఉండి న్యాయం చేయాలని అందర్నీ కోరుతూ న్యాయం కోసం పోరాటం చేస్తారు. ఈ యొక్క సంఘటన జరిగినా ఎస్టీ కాలనీలో ఈ సంఘటన గురించి ప్రెస్ మీట్ జరిగింది....