*ఇక బ్లాక్ కెమండోలు కనిపించరు!*
న్యూఢిల్లీ :
వీఐపీలకు వ్యక్తిగత భద్రతను కల్పిస్తున్న ఎన్‌ఎ్‌సజీ బ్లాక్ కమాండోలు, ఐటీబీపీ బలగాలను ఆ బాధ్యతల నుంచి మోదీ సర్కారు తప్పించనుంది. వాటి స్థానంలో సీఆర్పీఎ్‌ఫకు ఈ బాధ్యతలను కేటాయించనుంది. తీవ్రవాద, ఉగ్రవాద ముప్పును ఎక్కువగా ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు, తదితర ముఖ్యనేతలను బ్లాక్ క్యాట్ కమాండోలు కంటిరెప్పలా ఇప్పటిదాకా కాపాడుతూ వస్తున్నారు. ఇకపై వారి సేవలను ఇతర పారామిలిటరీ విధులకు వినియోగించు కోనున్నట్టు రక్షణ వర్గాలు తెలిపాయి.
ప్రముఖుల వ్యక్తిగత భద్రతను సీఆర్పీఎఫ్ వీఐపీ సెక్యూరిటీ యూనిట్, సీఐఎ్‌సఎఫ్ వీఐపీ వింగ్ (ఎస్‌ఎ్‌సజీ) ఇక ముందు చూస్తాయి. ఈ విభాగాలు ఇప్పటికే సోనియా కుటుంబాని కి ఆర్‌ఎ్‌సఎస్ అధినేత మోహన్ భగవత్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ తదితర
200 మందికి భద్రత అందిస్తున్నాయి.
వీఐపీలకు వ్యక్తిగత భద్రతను కల్పిస్తున్న ఎన్‌ఎ్‌సజీ బ్లాక్ కమాండోలు, ఐటీబీపీ బలగాలను ఆ బాధ్యతల నుంచి మోదీ సర్కారు తప్పించనుంది. వాటి స్థానంలో సీఆర్పీఎ్‌ఫకు ఈ బాధ్యతలను కేటాయించనుంది.