అసాంఘిక శక్తులను హెచ్చరిస్తూ ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ.
కౌంటింగ్ దృష్ట్యా అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు టి. సుండుపల్లి మండల పోలీసులు సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తుగా నిలువరించాలనే ముఖ్య ఉద్దేశంతో అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ బి కృష్ణారావు గారి ఆదేశాల మేరకు టి. సుండుపల్లె మండలపోలీస్ స్టేషన్ ఎస్సై ఎస్.కె ఎం హుస్సేన్ మండల పరిధిలో పోలీస్ స్టేషన్ నుంచి ఊరి శివారు వరకు, మరియు మడితాడు,రాయవరం గ్రామాలలో ఎస్.కె ఎం హుస్సేన్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం బిఎస్ఎఫ్ జవానులు మరియు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించారు.
సుండుపల్లి మండల ఎస్సై ఎస్ కే ఎం హుస్సేన్ మడితాడు మరియు రాయవరం స్థానికులతో సమావేశమై జూన్ 4 వ తేదీ వరకు ఎలక్షన్ కోడ్ తో పాటు 144 సెక్షన్ మరియు 30 పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని, చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. ప్రజలందరూ సంయమనం పాటిస్తూ, పోలీస్ వారికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సుండుపల్లి ఎస్సై ఎస్కే ఎం హుస్సేన్ మరియు హెడ్ కానిస్టేబుల్ రాజు, ప్రవీణ్, మరియు స్టేషన్ సిబ్బంది, బిఎస్ఎఫ్ మిలిటరీ బలగాలు పాల్గొన్నారు.