మైనర్లకు వాహనాలు ఇస్తే శిక్షార్హులని, అటువంటి వారుపై కఠిన చర్యలు

 


*మైనర్ లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు.*


 *రాజమండ్రి*


    మైనర్లకు వాహనాలు ఇస్తే శిక్షార్హులని, అటువంటి వారుపై కఠిన చర్యలు తప్పవని రాజమండ్రి సౌత్ జోన్ డిఎస్పి ఎం అంబికా ప్రసాద్ హెచ్చరించారు. రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ, సిఐ వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 30 మంది మైనర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రోడ్డు భద్రత నియమాల పై అవగాహన  కల్పించారు. మైనర్లకు, డ్రైవింగ్ లైసెన్సు లేనివారికి వాహనాన్ని ఇచ్చి డ్రైవింగ్ చేయించడానికి కుటుంబ సభ్యులు, సంరక్షకులు కారణం కాకూడదని హితవు పలికారు. సంబంధిత అధికారులతో జారీ చేసిన లైసెన్స్ లేని వారు వాహనాన్ని నడపడం, తద్వారా ఏదైనా ప్రమాదానికి గురైతే అతని కుటుంబం, గాయాల పాయలైన వారు, చనిపోయిన వారి కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇది ఎవరికి శ్రేయస్కరం కాదన్నారు. గత మూడు రోజులుగా ద్విచక్ర వాహనాలు నడిపే మైనర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి 30 మంది మైనర్లు ద్విచక్ర వాహనాలు నడుపుతుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 30 ద్విచక్ర వాహనదారుల నుండి రూ.16 వేలను ఈ-చలాన్ రూపంలో జరిమానాలకు విధించినట్లు వారు తెలిపారు. అలాగే రాజమండ్రి సౌత్ జోన్ పరిధిలో నిరంతరం నిఘ ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ తెలిపారు.