AP CM జగన్ విదేశీ పర్యటన ముగిసింది.
ఇప్పటికే ఆయన లండన్ నుంచి బయల్దేరారు. రేపు తెల్లవారుజామున 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా
తాడేపల్లిలోని నివాసానికి వెళ్తారు. రేపు మధ్యాహ్నం పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యే అవకాశం ఉంది.
కౌంటింగ్ ఏర్పాట్లు, పోస్టల్ బ్యాలెట్ వివాదం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. జగన్ ఈనెల 17న విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.