19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్

 


19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న  పవన్ కళ్యాణ్ 


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా  పవన్ కళ్యాణ్ ఈ నెల 19వ తేదీ, బుధవారం నాడు పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కేటాయించిన సంగతి విదితమే. పవన్ కళ్యాణ్ ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న శాఖలను కేటాయించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.