*YS జగన్మోహన్ రెడ్డి అనే... నేను...!!*
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసి నేటికి సరిగ్గా ఐదేళ్ళు....
ఆనాడు ప్రమాణ స్వీకార వేదికపైనే... ఆనందపరవశురాలై... తన బిడ్డను ముద్దాడిన ఆ దృశ్యం... రాజకీయాలకు అతీతంగా ప్రతి హృదయాన్నీ తాకిందనడంలో సందేహం లేదు... ఆనాడు ఆ తల్లి కళ్ళలోని ఆనందం.... ఐదేళ్ళు గిర్రున తిరిగే సరికి ఎందుకు ఆవిరైపోయింది...?? అన్న వదిలిన బాణం... అన్నకే శరాఘాతం ఎందుకయ్యింది...??
కసిగా ప్రజావేదిక విధ్వంసంతో మొదలైన 151 స్థానాల చారిత్రాత్మక విజయ ప్రస్థానం... నేడు ఏ తీరానికి చేరబోతోందో... మరో నాలుగు రోజుల్లో తేటతెల్లం కానుంది...