CBSE, IIT & OLYMPIAD రాజంపేటలో ఏ పాఠశాలలో ఉన్నాయో అధికారులే ప్రకటన చేయాలి.

 


అన్నమయ్య జిల్లా  

CBSE, IIT & OLYMPIAD రాజంపేటలో ఏ పాఠశాలలో ఉన్నాయో అధికారులే ప్రకటన చేయాలి.


అనుమతి లేకుండా అక్రమ అడ్మిషన్ చేస్తున్న యాజమాన్యాలకి అమ్ముడుపోయిన విద్యాశాఖ అధికారులుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. 


 గత కొంతకాలంగా రాజంపేట పట్టణంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలో విద్యను వ్యాపారంగా మార్చుకొని ఆ పాఠశాలలోనే విద్యార్థులకు ముందుగానే పార్టీ పుస్తకాలు వల్ల స్కూల్ పేరుతో ప్రింట్ చేపించి విక్రయిస్తున్నారని ప్రైవేట్ టీచర్లను ఆసరాగా ఉంచుకొని గొప్పల ప్రగడబాలు పలికి దాత ఒక 3,000 నుంచి 5000 వరకు ముందస్తు అక్రమ అడ్మిషన్ చేస్తూ వసూలు చేస్తున్నారని మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడియస్ యూ జిల్లా అధ్యక్షుడు నేటి నాగేశ్వర స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్  ఇండియా జిల్లా కార్యదర్శి సర్వేపల్లి నరసింహ నిరసన తెలిపారు. 


                 పట్టణంలో ఉన్న ఏ ప్రైమరీ స్కూల్ కు కూడా షిరిడి సాయి రెయిన్బో స్కూల్, BSC ప్రైమరీ స్కూల్, మరో రెయిన్బో హైస్కూల్లో CBSE, IIT & OLYMPIAD ఉన్నాయని తల్లిదండ్రులను  మోసం చేస్తూ కింగ్ బ్రిడ్జ్  స్కూల్, వి బి స్కూల్, ఐడిల్  స్కూల్ ఫ్యూచర్ మైండ్ వంటి స్కూళ్లలో  కనీస వసతులు లేకుండా నివాసం అంటున్నటువంటి వసతి గృహాలను స్కూలుగా అమర్చుకొని  పబం కడుపుతున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు.


 అదేవిధంగా ఇన్ ఫ్రంట్ జీసస్ హై స్కూల్, రాజు హై స్కూల్, సాయి విద్యాలయ హై స్కూల్, అక్షర, నలంద హై స్కూల్,  BVN హై స్కూల్ వంటి ప్రధాన పాఠశాలలలో అక్రమ అడ్మిషన్ లు, పుస్తకాలు విక్రయిస్తున్నప్పటికీ మరియు విద్యార్థులు టాలెంట్ టెస్ట్ అనే పేరుతో పేద విద్యార్థులకు అన్యాయం చేకూరేలా పాఠ్యపుస్తకాల పేరుతో  ఇప్పటికే చాలా దారుణాలు తెరశారు. జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఎన్నడూ కూడా పాఠశాలలపై విచారించి చర్యలు తీసుకోన్న పాపాన పోలేదని అన్నారు. CBSE, IIT & OLYMPIAD పేర్లతో విచ్చలవిడిగా ప్రచారాల సాగుతున్నప్పటికీ అధికారుల నమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఇలాంటి పాఠశాలలో ఎక్కడ ఉన్నాయో  అధికారులే ప్రకటన వెలువరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకులు రెడ్డయ్య,వెంకటాద్రి, నవీన్ , పిడిఎస్యు రవి  విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.



                 అభినందనలతో.... 

నాగేశ్వర నేతి 

పిడియస్ యూ జిల్లా  ఆధ్యక్షుడు

                          

నరసింహ సర్వేపల్లి ఎ

స్.ఎఫ్. ఐ జిల్లా కార్యదర్శి