భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ఉగ్రముప్పు

 


భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ఉగ్రముప్పు

టీ20లో భాగంగా జూన్ 9న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉగ్రముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తలపై ఐసీసీ స్పందించింది. ‘‘ఈ మెగా టోర్నీని సురక్షితంగా నిర్వహించేందుకు మేం కఠిన చర్యలు తీసుకున్నాం. ప్రతి ఒక్కరి భద్రతే మాకు ముఖ్యం. దాని కోసం వివిధ అంచెల్లో సెక్యూరిటీని నియమించాం. ఆ రాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం’’ అని ఐసీసీ ప్రతినిధులు పేర్కొన్నారు.