*చోరీ కేసులో ఆరు ల్యాప్ టాప్ లు, మూడు మొబైల్స్ స్వాధీనం*
*ద్వారక జోన్ సీఐ శ్రీనివాసరావు*
ఎంవీపి కాలనీ
చోరీ కేసులో నిందితులు నుంచి ఆరు ల్యాప్ టాప్ లు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నా మని ద్వారకా జోన్ సీఐ సి హెచ్. శ్రీనివాసరావు తెలిపారు ఆయన మాట్లాడుతూ తమిళ నాడుకి చెందిన ఇద్దరు యువకులు గణేష్ శంకర్,మంజునాథన్ మహా రాష్ర్టవిశాఖలో చోరీలు చేసి వచ్చిన
డబ్బుతో జల్సాలు చేస్తున్నారు వేరు 2021 నుంచి ఇక్కడ నేరాలు చేస్తున్నారు ఇక్కడ15 రోజుల్లో మూడు చోరీలు చేశారు భీమిలి, ఆనందపురం లో కూడా వీరి మీద చోరీ కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు వీరిని వెంకోజీపాలెం జంక్షన్ వద్ద అరెస్ట్ చేశామన్నారు గణేష్ శంకర్ కి భార్య,నలుగురు పిల్లలు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు మీడియా సమావేశం లో ఎంవీపీ స్టేషన్ క్రైమ్ ఎస్ఐ ఎన్.జగదీష్ పాల్గొన్నారు.