అనకాపల్లి జిల్లా పోలీసు* పత్రికా ప్రకటన







అనకాపల్లి జిల్లా పోలీసు
పత్రికా ప్రకటన

 *ఎన్నికల కౌంటింగ్ రోజు, తదనంతరం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పట్టిష్ట చర్యలు తీసుకుంటున్నాం: విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ గారు*

 *144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుంది.* 

*అనకాపల్లి, మే 20:* అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి పార్లమెంట్, 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ కు (చోడవరం, మాడుగుల, అనకాపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం) జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించుటకు చెయ్యవలసిన కార్యచరణ పై ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఆదేశాల మేరకు జిల్లా ప్రజలందరూ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా జిల్లా యంత్రాంగానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ గారు జిల్లా ఎస్పీ గారితో కలిసి శంకరం గ్రామం, కలెక్టరేట్ వద్ద గల ఫ్యూచర్ వరల్డ్ పాఠశాల నందు ఉన్న కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు ను మరియు ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయుట తదితర అంశాలపైన / స్ట్రాంగ్ రూము ను సందర్శించి, స్ట్రాంగ్ రూము లో ఈవీఎంలు, వీవీప్యాట్‌ల మరియు  కంట్రోల్ యూనిట్ రక్షణకు కేంద్ర బలగాలు, ఆర్మ్డ్ రిజర్వు మరియు సివిల్ పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాట్లును సమీక్షించి  ఎన్నికల కౌంటింగ్ రోజు, తదనంతరం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తీసుకోవలసిన భద్రత చర్యల గురించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.

కౌంటింగ్ కి ముందుగానీ, కౌంటింగ్ రోజు గాని, కౌంటింగ్ తర్వాత గాని ఏటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటున్నామని, కౌంటింగ్ రోజు 144 సెక్షన్, 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు.
కౌంటింగ్ ముగిసిన తర్వాత ఎటువంటి ఊరేగింపులు, ర్యాలీలు చేయకూడదని, ఎవరు కూడా గుంపులుగా ఉండకూడదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని, అల్లర్లలో పాల్గొనే వారి వాహనాలు సైతం సీజ్ చేస్తామన్నారు. ప్రజలందరూ సంయమనంతో వ్యవహరిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు సహకరించాలని డీఐజీ గారు సూచించారు.

డీఐజీ గారి తో పాటు జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీక్రిష్ణ ఐపీఎస్., అదనపు ఎస్పీ శ్రీ బి.విజయభాస్కర్, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ 
ఎస్.అప్పలరాజు, ఎస్.బి డీఎస్పీ శ్రీ బి.అప్పారావు పాల్గోన్నారు. 

*జిల్లా పోలీసు కార్యాలయము,* 
*అనకాపల్లి.*