వివేకా హత్యలో జగన్ భార్య భారతి పాత్ర.... సునీత

 *వివేకా హత్యలో జగన్ భార్య భారతి పాత్ర.... సునీత*




సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.



 ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి వివేకా హత్య కేసులో సీఎం జగన్ సతీమణి భారతి పాత్ర ఉందని, 


దీనిపై విచారణ జరగాల్సిందేనని ఆమె అన్నారు. 




వివేకా హత్య గురించి సీఎం జగన్, భారతి, అవినాష్ రెడ్డికి ముందే తెలుసని, ఈ విషయంపై సీబీఐ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. 



దీనిపై దర్యాప్తు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.