ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి
సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్ మంగళగిరిలో నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు.
1992 కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. కొత్త డీజీపీగా హరీశ్‌కుమార్‌ను ఎంపిక చేసిన సీఈసీ.. ఆయన వెంటనే బాధ్యతలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. హరీష్ కుమార్ గుప్తా వెంటనే ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు.