*అనకాపల్లి జిల్లా పోలీసు*
*పత్రికా ప్రకటన*
*గౌరవ భారత దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రాజుపాలెం గ్రామం, కసింకోట మండలం తేదీ. 06-05-2024 న బహిరంగ సభకు విచ్చేయు సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు:* *జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ, ఐపిఎస్*
*అనకాపల్లి, మే 6:*
గౌరవ భారతదేశ ప్రధాని గారు తేది.06.05.2024 కసింకోటమండలం, రాజుపాలెం గ్రామంలో జాతీయ రహదారి ప్రక్కన బహిరంగ సభ కు విచ్చేయచున్న సందర్భంగా ప్రజల సౌకర్యార్థం భారీ వాహనాలు, కంటైనర్లు, టిప్పర్లు లారీలు మొదలగు వాహనాలను ట్రాఫిక్ దృష్ట్యా మళ్లింపు చేయడం జరుగుతుంది.
*06.05.2024 న మధ్యాహ్నం 13.00 గంటల నుండి 18.00 వరకు మాత్రమే ఈ ట్రాఫిక్ మళ్లింపు భారీ వాహనాలకు ఉంటుంది.*
*విశాఖపట్నం నుండి తుని వైపు జాతీయ రహదారి మీదుగా వెళ్లే వాహనాలు విశాఖపట్నం నుండి బయలుదేరి లంకెలపాలెం జంక్షన్ - పరవాడ - అచ్యుతాపురం - ఎలమంచిలి - రేగుపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా తుని చేరుకోవాలి.*
*తుని నుండి విజయనగరం , విశాఖపట్నం వైపు వాహనాలు వెళ్లేందుకు* తుని - రేగుపాలెం జంక్షన్ - ఎలమంచిలి బైపాస్ -
అచ్యుతాపురం - పరవాడ - లంకెలపాలెం జంక్షన్- అసకపల్లి జంక్షన్ మీదుగా విజయనగరం, శ్రీకాకుళం లేదా దేశపాత్రునిపాలెం నుండి జాతీయ రహదారి మీదుగా విశాఖపట్నం చేరుకోవచ్చు.
*సబ్బవరం జాతీయ రహదారి మీదగా వచ్చే వాహనాలు* అసకపల్లి - లంకెలపాలెం జంక్షన్ - పరవాడ - అచ్యుతాపురం - ఎలమంచిలి బైపాస్ - రేగుపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా తుని వైపు వెళ్లవచ్చు.
*చోడవరం నుండి తుని వైపు వెళ్లే వాహనాలు అనకాపల్లి బ్రిడ్జి - మునగపాక - పూడిమడక రోడ్డు - అచ్యుతాపురం జంక్షన్ - ఎలమంచిలి బైపాస్- రేగుపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా తుని వైపు వెళ్లవచ్చు.*
*ప్రజలు రేపు జరగబోవు ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపును దృష్టిలో ఉంచుకొని సురక్షితంగా ప్రయాణం చేయాలని* ప్రజలకు విజ్ఞప్తి చేసిన
జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మురళీకృష్ణ,ఐపీఎస్ గారు
*జిల్లా పోలీస్ కార్యాలయం,*
*అనకాపల్లి.*