*అనకాపల్లి జిల్లా పోలీస్*
*పత్రికా ప్రకటన*
*ఈవీఎం స్ట్రాంగ్ రూముల చుట్టుపక్కల 2 కిలోమీటర్ల వరకు రెడ్ జోన్ గా ప్రకటించబడింది : అనపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్., గారు.*
*అనకాపల్లి, మే 30:* గౌరవ రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్., వారి ఉత్తర్వుల మేరకు అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్., గారు అనకాపల్లి మండలం, శంకరం గ్రామం, కలెక్టరేట్ వద్దగల ఫ్యూచర్ వరల్డ్ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్ గా ప్రకటించారని తెలియజేశారు. ఈ ప్రకటన ద్వారా స్ట్రాంగ్ రూమ్‌ల చుట్టూ ఉన్న గగనతలంలో అనధికార డ్రోన్ కార్యకలాపాలను 2 కిలోమీటర్ల మేర నిషేధించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ... ఈ రెడ్ జోన్ నిబంధనలు వెంటనే అమలులోకి వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించినారు. ఈ రెడ్ జోన్ నిబంధనలు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు అమలులో ఉంటాయని అన్నారు. ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమించిన ఎడల వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
*జిల్లా పోలీస్ కార్యాలయం,*
*అనకాపల్లి.*