*ఇవాళ ఓడితే ఇంటికే..*
హైదరాబాద్:మే 09
ఐపీఎల్-2024లో ఇవాళ ఆర్సీబీ-పంజాబ్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్ రేసులో ఉన్నాయి.
ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఆర్సీబీ మిగతా మూడు మ్యాచుల్లో కచ్చితంగా గెలవాలి. ప్రస్తుతం 8 పాయింట్లు ఉండగా.. మూడు గెలిస్తే 14 పాయింట్లు అవుతాయి.
అలాగే మిగతా జట్ల కంటే ఎన్ఆర్ఆర్ మెరుగ్గా ఉండాలి. పంజాబ్ పరిస్థితీ అంతే. ఇవాళ మ్యాచులో ఓడిన జట్టు ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు రేసులో ముందు కెళ్తుంది...