కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి.

పత్రికా ప్రకటన




కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి. 


ఎటువంటి పొరపాట్లు జరగకుండా  రిటర్నింగ్ అధికారులు భాధ్యత వహించాలి


 

జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.ఎ. మల్లికార్జున


విశాఖపట్టణం, మే 22:- జిల్లాలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో వచ్చేనెల 4వ తేదీన నిర్వహించబోయే ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్ల విషయములో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని రిటర్నింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లికార్జున మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారులు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. కౌంటింగ్ ఏర్పాట్ల పై అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసి కౌంటింగ్ ఏర్పాట్లకు   చేపడుతున్న చర్యలు గురించి వివరంగా తెలియజేయడం ద్వారా వారిలో ఉండే అపోహలు తోలగించాలని అన్నారు. కౌటింగ్ సెంటర్ల వద్ద సి సి కెమెరాల ఏర్పాటు,  బారికేడ్ల ఏర్పాటు, కౌటింగ్ హాలులో టేబుళ్ల ఏర్పాటు,  రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఐడంటిటీ కార్డుల మంజూరు గురించి రిటర్నింగ్ అధికారులను అడగి తెలుసుకున్నారు.  ఈ నెల 31వ తేది సాయంత్రం కల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్ ఏర్పాటు, సెల్ ఫోన్ బద్రపరచు సెంటర్, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. కౌటింగ్ విధుల కొరకు సిబ్బంది మొదటి విడత రాండమైజేషన్ ఈ నెల 25వ తేదిన నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రెండవ విడత రాండమైజేషన్ జూన్ 2వ తేదిన నిర్వహించడం జరుగుతుందన్నారు.  కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈ నెల 27వ తేదిన ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ సమయానికి ఒక నిమిషం ముందు వరకు వచ్చే పోస్టల్ బ్యాలెట్ సమాచారం పొందడం, హోమ్ ఓటింగ్, తదితర వివరాల పై అధికారులకు సూచనలు జారీ చేశారు.    

  ఈ సమావేశంలో జి వి ఎమ్ సి కమిషనర్ సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కె మయూర్  అశోక్, జి వి ఎమ్ సి ఎడిసి కె.ఎస్. విశ్వనాథన్,  జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్, రెవిన్యూ డివిజనల్ అధికారులు హుస్సేన్ సాహెబ్, కె భాస్కర్ రెడ్డి, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.

జారీః  సార్వత్రిక ఎన్నికల మీడియా కేంద్రం, ఎంసీఎంసీ, విశాఖపట్టణం.