పల్నాడు జిల్లాలో తనిఖీలు.. వైకాపా నేతలు ఇళ్లలో పెట్రోల్ బాంబులు



 పల్నాడు జిల్లాలో తనిఖీలు.. వైకాపా నేతలు ఇళ్లలో పెట్రోల్ బాంబులు 


మాచవరం: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో బాంబుల కలకలం రేగింది. వైకాపా నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్‌ బాంబులను పోలీసులు గుర్తించారు..


ఇటీవల జరిగిన ఎన్నికలు సంబంధించిన గొడవలపై విచారణకు పోలీసులు గ్రామానికి వెళ్లారు. వైకాపా, తెదేపా నేతలను అదుపులోకి తీసుకునే క్రమంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వైకాపా నేతల ఇళ్లలో బాంబులను గుర్తించారు..


మాచర్లలో పోలీసుల కవాతు


మరోవైపు జిల్లాలోని మాచర్ల ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించడంతో ఆంక్షలు కొనసాగుతున్నాయి. పట్టణానికి చెందిన ప్రధాన మార్గాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. 144 సెక్షన్‌ కారణంగా షాపులు తెరుచుకోలేదు. మాచర్ల పట్టణంలో పోలీసులు బారికేడ్లు పెట్టి తనిఖీలు చేస్తున్నారు..