AP: ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఎన్నికలసంఘం కేటాయించింది. బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఎన్నికల అధికారులు గాజుగ్లాసు గుర్తును కేటాయించారు. దీనిపై జనసేన మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గాజుగ్లాసు గుర్తును ఇతర అభ్యర్థులకు కేటాయించవద్దని అందులో పేర్కొంది. విచారణ చేపట్టిన న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది. న్యాయస్థానం నిర్ణయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.