*బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దు: ఈసీ*
కంటైనర్లు, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని పెట్రోల్ బంక్ నిర్వాహకులను ఈసీ ఆదేశించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయిల్ బంకుల లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని బంకుల యజమానులకు నోటీసులు పంపింది. పోలింగ్ తర్వాత APలో పలుచోట్ల హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో EC ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది