*పత్రిక ప్రకటన*
*విశాఖపట్నం సిటీ*
*తేది 25/05/2024*
*విశాఖ మహా నగరంలో రోడ్లు అన్ని ప్రజలు క్షేమముగా వినియోగించుకునే విధముగా యెటువంటి రాంగ్ పార్కింగ్ లకు అవకాశం లేకుండా ,ఈ రోజు నుండి రాబోవు నెల మొత్తం నగర రొడ్డులు వినియోగించే ప్రతీ వాహనదారుడు రోడ్డు క్రమశిక్షణ తీసుకురావాలనే సదుద్దేశంతో అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ & అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగినది.*
అందులో భాగముగా ఈ రోజు నగరవ్యాప్తముగా అనధికార పార్కింగ్, రాంగ్ పార్కింగ్ చేసిన వాహనాలను ముఖ్యముగా రోడ్డు చివర గల ఎల్లో లైన్ క్రాస్ చేసి వాహనాలు పార్కింగ్ చేసినచో ఖచ్చితముగా వారి వాహనాలకు ఇటీవల సిపి గారి ఆధ్వర్యంలో నగర పోలీసు శాఖ కొనుగోలు చేసిన 200 వీల్ లాకర్ లను వినియోగించి వెహికల్ ను లాక్ చేయడం జరుగుతుంది, సదరు వెహికల్ కు అక్కడ సంబంధిత పోలీసు సిబ్బంది ఫోన్ నం, ఫైన్ అమౌంట్ తో ఒక స్టికర్ అతికించడం జరుగుతుంది, 1035/- రూపాయల ఫైన్ కట్టిన తరువాత మాత్రమే సదరు వాహనాలను తిరిగి ఇవ్వడం జరుగుతుంది.ఈ స్పెషల్ డ్రైవ్ సదుద్దేశం రోజురోజుకీ పెరుగుతున్న జనాభా, వాహనాలతో నగరంలో రోడ్డుప్రమాదాలు, ట్రాఫిక్ మరింత పెరిగేఅవకాశం ఉన్నందున నగర ప్రజలందరూ పూర్తి ట్రాఫిక్ క్రమశిక్షణ అలవరుచుకొని రోడ్డు ప్రమాదాలు , ట్రాఫిక్ రద్దీ నుండి ప్రజలు భద్రంగా ఉండడం, ఈ స్పెషల్ డ్రైవ్ నెల రోజుల వరకూ నిర్వహించడం జరుగుతుంది.
*ఈ రోజు అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ & అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారి ఆదేశాలతో నగర వ్యాప్తంగా అన్ని ముఖ్య ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది.*
విశాఖ మహానగరంలో రోడ్డు ప్రమాదాల కారణముగా సంవత్సరానికి 70 పైగా మరణాలు సంభవిస్తున్నాయని, ముఖ్యముగా యువత, విద్యార్థులు మధ్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పలు ప్రమాదాలకు కారణం అని , మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వలన వారి ప్రాణాలతో పాటూ, రోడ్డుపై వెళ్ళు ఇతరుల ప్రాణాలకు హాని కలిగిస్తున్నారని,ఇటీవల సిపి గారి ఆధ్వర్యంలో నగర పోలీసు శాఖ కొనుగోలు చేసిన 200 బ్రీత్ ఎనలైజర్స్, కమిషనరేట్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వినియోగిస్తూ మద్యం త్రాగి వాహనం నడిపే వాహనాదారులపై కేసులు నమోదు చేయడం ద్వారా రోడ్డుప్రమాదాలను అరికట్టడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, శ్రీ ఫక్కీరప్ప కాగినెల్లి,ఐ.పీ.ఎస్., గారు , tarffic Adcp, traffic acp -01,traffic acp -02, traffic ci లు, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
నగర పోలీస్ తరపున, విశాఖపట్నం సిటీ