ఏపీలో గెలిచేదెవరో?- పక్క రాష్ట్రాలలో స్థిరపడిన వారు కూడా వచ్చి వోట్ వేయడం.


 *ఏపీలో గెలిచేదెవరో?- పక్క రాష్ట్రాలలో స్థిరపడిన వారు  కూడా వచ్చి వోట్ వేయడం..భారీఎత్తున  పోలింగ్​  జరగడం వెనుక కారణాలేంటి?*


*తగ్గేదేలే"! అంటూ ఓటర్లు పెద్ద ఎత్తున తరలి రావడానికి కారణాలేంటి?*


 *పోలింగ్ ప్రారంభానికి ముందే బారులుదీరడం వెనుక ఆంతర్యమేంటి?*



*2019లో 79.77 శాతం పోలింగ్​ నమోదు కాగా, ఈ సారి 2024 అంతకుమించి 81.86 శాతం పోలింగ్ నమోదైన వైనం*


ఆంధ్రప్రదేశ్​ ఓటర్ల నాడి ఏంటి? 


తండోపతండాలుగా తరలివచ్చిన ఓటర్లు ఏ బటన్​ నొక్కారు? 


భారీగా నమోదైన పోలింగ్​ను ఎలా భావించాలి?

 

రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు? 

 

సర్వేలు ఏం చెప్తున్నాయి?


 ఏ అంశాలను పరిశీలించాయి?


 ఏఏ వర్గాల అభిప్రాయాలను సేకరించాయి? 


విజయానికి ప్రాతిపదిక ఏంటి? ఓటమిని ప్రభావితం చేసే కారణాలను ఎలా అంచనా వేయాలి? 


 పూర్తి వివరాల్లోకి వెళ్దాం.



2014లో రాష్ట్ర విభజన అంశం, కాంగ్రెస్​పై పెరిగిన వ్యతిరేకత భారీ పోలింగ్​కు బీజం వేసింది.

 రాష్ట్ర పునర్నిర్మాణం ఐటీ విజనరీ చంద్రబాబుతోనే సాధ్యమని నమ్మిన ప్రజలు అధికారాన్ని అప్పగించారు. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టుతో పాటు అమరావతి రాజధాని నగరానికి పునాదులు పడ్డాయి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జగన్​మోహన్​రెడ్డి ఇచ్చిన హామీలు వైఎస్సార్సీపీ విజయానికి దోహదం చేశాయి


వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజల మద్దతు ఉన్నా అవి ఓటు వేసే దాకా తీసుకెళ్లాయా లేదా అనే అంశం   మీద  వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి


విశాఖను రాష్ట్ర రాజధానిగా చేస్తామన్నా ఉత్తరాంధ్ర ప్రజల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపించిందని సర్వే సంస్థలు చెప్తున్నాయి


పోలవరం ప్రాజెక్టు, రాజధాని నగర నిర్మాణాలు కాస్త మైనస్ గా సర్వే లు చెబుతున్నారు


విద్యుత్​ బిల్లులు, చెత్త పన్నులు, పెరిగిన ఆర్టీసీ చార్జీలు ప్రజల్లో ప్రభావం చూపిస్తుంది అని సర్వేలు చెబుతున్నారు


ఇక చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం చేస్తామన్న టీడీపీ అధినేత చంద్రబాబు హామీ, పోలవరం కట్టిస్తామన్న మోదీ మాటలపై విశ్వాసం, ఇరు పార్టీలనూ ఏకతాటిపైకి తీసుకురావడంలో జనసేనాని పవన్​ కల్యాణ్ చొరవ కూటమి​పై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి.

అయితే ఈ అంశాలు ప్రజలలోకి వెళ్లాయి,ఎన్డీయే కూటమి ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలలోకి బలం గా వెళ్లాయి..అవి కాస్త ఓట్ బ్యాంక్ గా పెరిగింది అని రాజకీయ విశ్లేషకుల మాట


కొన్ని సర్వేలు వైసీపీ కి అనుకూలంగా ఉన్నా.. మరికొన్ని సర్వేలు ఎన్డీయే కూటమి కి పూర్తి గా అనుకూలం గా ఉన్నాయి...



మొత్తంలో ప్రజల నాడి,కొత్తగా ఓట్లు వచ్చిన యూత్ డిసైడ్ ఫాక్టర్ అయ్యారు....వారి మాటలు షోషల్ మీడియా లో చూస్తే...45:55 నిష్పత్తి లో ఉండటం గమనార్హం.