*ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు*
AP: ఈ నెల 7న రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
మిగతా చోట్ల తేలికపాటి వానలు పడతాయని తెలిపింది.
కాగా ఇవాళ 30 మండలాల్లో తీవ్ర వడగాలులు, 247 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.