*సిఎం జగన్‌పై దాడి కేసుకు సంబంధించి కోర్టులో విచారణ*
నిందితుడు సతీశ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది.
8 వ అదనపు జిల్లా న్యాయస్థానంలో నిందితుడి తరఫు న్యాయవాది సలీం వాదనలు వినిపించారు.
సతీశ్‌ను పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం తీర్పును న్యాయమూర్తి రిజర్వు చేశారు.
దీని పై మంగళవారం ఉత్తర్వులు వెల్లడించే అవకాశముంది.