కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్


 *ఎన్నికల* *అక్రమాల* *నివారణకు* *ఎన్నికల* *సమన్వయకర

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ లో రాబోవు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగడానికి, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారాలకు తోడ్పడటానికి, ఎన్నికల అక్రమాలను నివారించడానికి, తమ దృష్టికి వచ్చిన అక్రమాలను, సమస్యలను ఎన్నికల ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడం కోసం ఎన్నికల నిఘా వేదికను ఏర్పాటు చేసింది. ఎన్నికల నిఘా సమన్వయకర్తలు 13 ఉమ్మడి జిల్లాలకు 13 మంది రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్  మరియు ఉన్నత పౌర సమాజ ప్రతినిధులను నియమించినట్లు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ చైర్మన్ జస్టిస్ జి. భవాని ప్రసాద్, ఉపాధ్యక్షులు ఎల్. వి .సుబ్రహ్మణ్యం, కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్, సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నిఘా సమన్వయకర్తలు వివరాలను మీడియాకు తెలిపారు. 

అనంతపూర్ జిల్లా కు చీఫ్ సెక్రటరీ గాను మరియు అనంతపురం జిల్లా కలెక్టర్ గాను కృషి చేసిన ఎస్. పి టక్కర్ ను, కర్నూలు జిల్లాకు కేరళ క్యాడర కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన డబ్ల్యు .ఆర్. రెడ్డి కడప జిల్లాకు రిటైర్డ్ ఐపిఎస్ అధికారి, జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ డైరెక్టర్ జనరల్ గా కృషి చేసిన సంతోష్ మెహ్ర మరియు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, చిత్తూరు జిల్లాకు రిటైర్డ్ ఐ ఆర్ ఎస్ అధికారి, ఇన్  కమ్ టాక్స్ డైరెక్టర్ జనరల్ గా కృషి చేసిన డాక్టర్ పి .రఘు, నెల్లూరు జిల్లాకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, పూర్వ కర్నూలు కలెక్టర్ రామ శంకర్ నాయక్, ప్రకాశం జిల్లాకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, పూర్వ డైరెక్టర్ జనరల్ మానవ వనరుల సంస్థ డి చక్రపాణి, గుంటూరు జిల్లాకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, పూర్వ  కాఫీ బోర్డు  చైర్మన్  మాజీ సలహాదారులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.వి .కృష్ణారావు, కృష్ణా జిల్లాకు పూర్వ చీఫ్ సెక్రటరీ, తెలంగాణకు చెందిన డాక్టర్ రాజీవ్ శర్మ మరియు టి సురేష్ బాబు పూర్వ మంగోలియా అంబాసిడర్, పశ్చిమగోదావరి జిల్లాకు రిటైర్డ్ జిల్లా జడ్జి ఏ .లక్ష్మి, తూర్పుగోదావరి జిల్లాకు తమిళనాడు కేడర్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, పూర్వ జమ్మూ & కాశ్మీర్ గవర్నర్ సలహాదారులు స్కందన్ కుమార్ కృష్ణన్, విశాఖపట్నం జిల్లాకు హర్యానా క్యాడర్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పూర్వ భారతఉక్కు -గనులు  కార్యదర్శి, పూర్వ హరియాన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ దిలీప్ సింగ్, విజయనగరం జిల్లాకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ రెడ్ క్రాస్  చైర్మన్ అజయ్ మిశ్రా, శ్రీకాకుళం జిల్లాకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, భారత ప్రభుత్వ పూర్వ స్పెషల్ సెక్రటరీ అటామిక్ ఎనర్జీ సిబిఎస్ వెంకట రమణలను ఎన్నికల నిఘా సమన్వయ కర్తలుగా నియమించారు.