AP Election 2024:సజ్జల వ్యాఖ్యలపై ఘాటూగా స్పందించిన: సీఈఓ ఎంకే మీనా
అమరావతి: వైసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఎన్నికల సంఘంపై (Election Commission) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే..
అయితే ఈ వ్యాఖ్యలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా (CEO Mukesh Kumar Meena)ఘాటుగా స్పందించారు. గురువారం మచిలిపట్నంలోని ఓ కౌంటింగ్ సెంటర్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో సీఈఓ ఎంకే మీనా మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్ రోజు లోపల హాల్లో ఎవరైనా అల్లర్లు చేయాలని చూస్తే వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ చేశారు..
అభ్యర్థి, ఏజెంట్‌లలో ఎవరైనా కౌంటింగ్ సెంటర్లో గొడవ చేయాలని, అడ్డుకోవాలని చూస్తే వారిని వెంటనే అక్కడి నుంచి బయటకు పంపిస్తామనివార్నింగ్ ఇచ్చారు. కౌంటింగ్ ఏరియా చుట్టూ ఎలాంటి ఊరేగింపులు చేయడానికి వీలులేదని తేల్చిచెప్పారు. ఆరోజు మధ్యం షాపులు కూడా పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ సెంటర్ల భద్రత కోసం మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు సీఈఓ ఎంకే మీనా తెలిపారు..