*చివరి 72 గంటల్లో, పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లు ఇవే*
*రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా*
అమరావతి మే 10: ఈనెల 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం చివరి 72 గంటల్లో మరియు పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో వివరించారు. హింసకు, రీపోలింగ్ కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యూహాత్మకమైన చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల డీఈవో లను, ఎస్పీ లను ఆయన ఆదేశాలు జారీచేశారు.
రాష్ట్రంలో ఈ నెల 13 న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చివరి 72 గంటల్లో చేయాల్సిన ఏర్పాట్లను ఆయన వివరిస్తూ ఈ నెల 11 వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి పోల్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి నిశ్శబ్ద కాలం (Silence Period) అమల్లోకి వస్తున్నదని, ఆ సమయంలో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుందని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎవరూ ఉల్లంఘించకూడదన్నారు. చట్టవిరుద్ధమైన సమావేశాలపై నిషేధం మరియు 48 గంటల వ్యవధిలో (సైలెన్స్ పీరియడ్) బహిరంగ సభలను నిర్వహించడంపై CrPC యొక్క సెక్షన్ 144 కింద నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేయబడతాయన్నారు. ఈ అంశం సెక్షన్ 144లో ప్రత్యేకంగా ఉండాలన్నారు. పోల్ ముగింపు సమయం ఆధారంగా 48 గంటల డ్రై డే సమయం సవరించబడుతుందన్నారు. పోల్ ముగిసే 48 గంటల ముందు లౌడ్ స్పీకర్లను అనుమతించకూడదన్నారు.
ఎన్నికల్లో ఎటు వంటి అవాంచనీయ సంఘటనలకు తావులేకుండా ఉండేందుకై ఆయుధాలు & మందుగుండు సామగ్రి అక్రమ రవాణాను నిరోధించడానికి పోలింగ్‌కు 3 రోజుల ముందు నుండి రాష్ట్రంలోను, అంతర్ రాష్ట్రాల నుండి వచ్చే లారీలు, వాణిజ్య వాహనాలు మరియు తేలికపాటి వాహనాల కదలికలపై గట్టి నిఘా ఉంచడం జరిగిందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నా ఆంధ్రప్రదేశ్‌లో ఓటు ఉన్న ఓటర్లు అనవసరంగా ఇబ్బందులకు గురిచేయకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఎస్‌హెచ్‌జి సభ్యులకు నిధులు, బహుమతులు, ఆహారం ఉచితంగా పంపిణీ చేయకూడదని, కమ్యూనిటీ హాళ్ల వినియోగం, కూపన్‌లు/కార్డుల పంపిణీ, కమ్యూనిటీ కిచెన్ మొదలైనవి దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
నియోజకవర్గం వెలుపల నుండి ప్రచారం నిమిత్తం తీసుకువచ్చిన మరియు నియోజకవర్గ ఓటర్లు కాని రాజకీయ కార్యకర్తలు/పార్టీ కార్యకర్తలు అందరూ ప్రచార సమయం ముగిసిన వెంటనే నియోజకవర్గం నుండి వెళ్లిపోవాలి. రాజకీయ పార్టీల రాష్ట్ర ఇన్చార్జిగా ఉన్న ఆఫీస్ బేరర్లు రాష్ట్ర ప్రధాన కార్యాలయంగా ప్రకటించబడిన ప్రదేశంలో మాత్రమే ఉండాలని, తమ పార్టీ కార్యాలయాన్ని దాటి బయటకు వెళ్లకూడదన్నారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు అన్ని రాజకీయ పక్షాలతో డీఈఓలు ముందుగా సమావేశాన్ని నిర్వహించాలన్నారు.
48 గంటల వ్యవధిలో ఓటర్లు కాని ఇతర వ్యక్తులు స్థానిక లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లు, కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు మొదలైన వాటిలో లేరని నిర్ధారించుకోవాలన్నారు. అయితే ఆలయ పట్టణాల్లోని యాత్రికులకు, పర్యాటక ప్రాంతాల్లోని పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోల్ ముగియడానికి నిర్ణయించిన సమయం ముగిసే 48 గంటల వ్యవధిలో రాజకీయ స్వభావం గల బల్క్ SMSలను పంపడం నిషేధించబడిందన్నారు. రాజకీయ పార్టీ / ఎన్నికల కార్యకర్త ద్వారా అలాంటి SMS ఏ ఓటరు కైనా అందితే, విచారణ కోసం సదరు మొబైల్ నంబర్ ను, ఆ SMSని పోలీసులకు పంపాలన్నారు.
*చివరి 72 గంటల్లో చేయాల్సిన ఏర్పాట్లు……*
#అన్ని పార్టీల ఏర్పాటుపై ర్యాండమైజేషన్ తర్వాత పోల్ డేకు రెండు రోజుల ముందుగా జిల్లా ఎన్నికల అధికారులు అందరూ ధృవీకరణ పత్రాలను పంపాలన్నారు.
#శాంతిభద్రతల పరిస్థితులు మరియు పోలింగ్ ముగిసే వరకు అత్యంత కీలకమైన 72 గంటల పాటు తీసుకున్న చర్యలను చర్చించుకునేందుకు డీఈఓలు, ఎస్పీ/సీపీ, ఇతర సీనియర్ పోలీసు అధికారులు, జనరల్/పోలీస్/వ్యయ పరిశీలకులతో జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించుకోవాలని సూచించారు.
#ఎలక్టోరల్ రోల్స్ యొక్క మార్క్డ్ మరియు వర్కింగ్ కాపీలను పోలింగ్ స్టేషన్ వారీగా ASD (A-Absentee; S-Shifted; D-Dead) జాబితాతో పాటు పోల్ డేకు రెండు రోజుల ముందుగా సిద్దం చేయాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ పోలింగ్ స్టేషన్ జాబితాను అందజేయాలన్నారు.
#పోలింగ్ రోజున సెక్టార్ అధికారికి అందజేయబడిన రిజర్వుడు ఈవీఎంలకు రిజర్వ్, మాక్ పోల్ రీప్లేస్డ్ తదితర లేబులింగ్లను తప్పని సరిగా చేయాలన్నారు. ఈవీఎంల రవాణాకు ఉపయోగించే వాహనాలు GPS ట్రాక్ లేదా మొబైల్ యాప్ ఆధారిత ట్రాక్ తప్పని సరిగా కలిగి ఉండాలని మరియు సాయుధ పోలీసుల రక్షణలో ఆ వాహనాలు ఉండాలని సూచించారు.
#పోలింగ్ స్టేషన్‌లో మోహరించిన CAPF పోలింగ్ స్టేషన్ గుమ్మం వరకే పరిమితం అవుతూ ప్రొసీడింగ్‌ను గమనించాలని, ప్రిసైడింగ్ అధికారి అభ్యర్థనపై తప్ప యూనిఫాం వ్యక్తి పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్లకూడదన్నారు.
#పోలింగ్ బూత్ ల వద్ద స్టాటిక్ మరియు యాక్టివ్ ఎలక్షన్ డ్యూటీ కోసం మేజిస్ట్రేట్‌తో మొబైల్ పెట్రోలింగ్, సరైన ప్రణాళికతో ఏరియా పికెట్ మరియు క్యూఆర్‌టి (QRT-Quick Reaction Team) వంటి బృందాలతో CAPFని మోహరించవచ్చు అన్నారు.
#48 గంటల వ్యవధిలో పోలింగ్ ప్రాంతంలో సినిమా/టెలివిజన్ లేదా ఇతర ఉపకరణాల ద్వారా ఎలాంటి ఎన్నికల అంశాలను ప్రదర్శించకూడదన్నారు.
#పోలింగ్ రోజు మరియు ఎన్నికల ముందు ప్రింట్ మీడియా లో రాజకీయ ప్రకటనలను రాష్ట్ర/జిల్లా MCMC నుండి ముందస్తు ధృవీకరణతో ప్రచురించుకోవచ్చని ఆయన తెలిపారు.
*పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లు……*
ఈ నెల 13 న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రోజు ఎన్నికల యంత్రాంగం చేయాల్సిన ఏర్పాట్లను ఆయన వివరిస్తూ పోలింగ్ జరిగే ప్రతి చోట మెడికల్ అటెండెంట్‌తో పాటు తగిన సంఖ్యలో మెడికల్/ఫస్ట్ ఎయిడ్ కిట్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. పోలింగ్ పార్టీలు, ఓటర్లు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకై ORS ప్యాకెట్లను సరఫరా చేయాలన్నారు. వడదెబ్బ విషయంలో చేయవలసినవి మరియు చేయకూడని వాటిపై హ్యాండ్‌బిల్ ప్రతి పోలింగ్ స్టేషన్‌కు సరఫరా చేయాలన్నారు. బీఎల్‌ఓతో ఓటింగ్ అసిస్టెంట్ బూత్‌లు, ఆల్పాబెటికల్ క్రమంలో ఓటర్ల జాబితా, పీడబ్ల్యూడీ, వృద్ధాప్య ఓటర్లకు సహాయం అందించాలన్నారు. మీడియా కంట్రోల్ రూమ్, కమ్యూనిటీ కంట్రోల్ రూమ్ మరియు వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూమ్‌లతో కూడిన జిల్లా కంట్రోల్ రూమ్ తప్పకుండా పని చేస్తుండాలన్నారు. EVM మెషీన్ల ట్రబుల్షూటింగ్ కోసం సమర్థవంతమైన సాంకేతిక సిబ్బందిని సిద్దంగా ఉంచాలన్నారు. పోలింగ్ రోజున EVM మెషీన్లపై ఫిర్యాదులు అందిన 15-20 నిమిషాలలోపే మెషీన్ల మరమ్మత్తుకు/రిప్లేస్ మెంట్కు చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ ఏజెంట్ అదే పోలింగ్ స్టేషన్ నుండి లేదా పొరుగున ఉన్న పోలింగ్ స్టేషన్ కు చెందిన వ్యక్తి అయి ఉండాలని, ఒకవేళ అందుబాటులో లేకుంటే అదే అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఓటరు అయ్యేలా చూడాలన్నారు. ప్రతి అభ్యర్థి లేదా ఎన్నికల ఏజెంట్ ప్రతి PS వద్ద ఒక పోలింగ్ ఏజెంట్‌ను మరియు ఇద్దరు రిలీప్ ఏజెంట్‌లను నియమించుకోవచ్చని, అయితే PS లోపల ఒక సమయంలో ఒక ఏజెంట్ మాత్రమే ఉండాలన్నారు. పోల్ రోజు ఫిర్యాదు నిర్వహణ మరియు సమాచార నిర్వహణ కోసం సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. వెబ్‌కాస్టింగ్ కెమెరాలు ఓటు వేసే కంపార్టుమెంట్లు మినహా గరిష్టంగా కనిపించే విధంగా ఉంచాలన్నారు. వెబ్‌కాస్టింగ్ ప్రసారం డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ మరియు సీఈఓ కంట్రోల్ రూమ్కే పరిమితం చేయాలని, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లేదా యూట్యూబ్‌లో లేదా వేరే వ్యక్తికి ప్రసారం చేయకూడదు అన్నారు. పోలింగ్ రోజున PS చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఎన్నికల ప్రచారం చేయరాదన్నారు. పోలింగ్ స్టేషన్కు 200 మీటర్లకు పైబడిన దూరంలో అభ్యర్థి ఎన్నికల బూత్ ను ఒక టేబుల్, కుర్చీలతో ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. అబ్జర్వర్ మరియు అధీకృత ఎన్నికల/పోలీస్ అధికారులు మినహా ఏ వ్యక్తి కూడా పోలింగ్ స్టేషన్ పరిసరాల్లో (పోలింగ్ స్టేషన్కు 100 మీటర్లు పరిధిలో) మొబైల్ / వైర్‌లెస్ సెట్‌లను తీసుకెళ్లడానికి లేదా ఉపయోగించడానికి అనుమతించకూడదన్నారు.
పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి మొత్తం నియోజకవర్గానికి సంబంధించి తన సొంత ఉపయోగం కోసం ఒక వాహనం, వారి ఎన్నికల ఏజెంట్ వినియోగార్థం ఒక వాహనం, పార్లమెంటరీ నియోజకవర్గంలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో తన ఎన్నికల ఏజెంట్ లేదా కార్యకర్తలు లేదా పార్టీ కార్యకర్తల ఉపయోగం కోసం మరొక వాహనం అనుమతించబడుతుందని ఆయన తెలిపారు. అయితే అభ్యర్థి వాహనాన్ని మరెవరూ వినియోగించకూడదని ఆయన తెలిపారు.
ఎన్నికలకు సంబంధం లేని ఇతర అవసరాల కోసం సొంత వాహనాలు ఉపయోగించుకునే యజమానులను నియంత్రించ కూడదన్నారు. ఓనర్లు లేదా కుటుంబ సభ్యులు ఉపయోగించే ప్రైవేట్ వాహనాన్ని పోలింగ్ స్టేషన్‌కు 200 మీటర్ల వరకు అనుమతించవచ్చన్నారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు తమ డ్యూటీ పాయింట్‌కి చేరుకోవడానికి ఉపయోగించే వాహనాలను అనుమతించాలన్నారు.
అభ్యర్థి పేరు/చిహ్నం/పార్టీ పేరు లేకుండా సాదా తెల్ల కాగితాలపై ఓటరు స్లిప్పులను అనుమతించవచ్చన్నారు. పోలింగ్ బూత్‌కు 100 మీటర్ల పరిధిలో ప్రచారానికి సంబంధించిన పోస్టర్లు/బ్యానర్‌లతో క్యాంఫైన్ నిర్వహించకూడదు అన్నారు. ప్రిసైడింగ్ అధికారి/ఇతర పోలింగ్ సిబ్బంది/ మైక్రో అబ్జర్వర్‌లు తమ మొబైల్‌ను సైలెంట్ మోడ్‌లో ఉంచుకోవచ్చని, అయితే వారు పోలింగ్ బూత్ వెలుపల నుండి మాత్రమే మాట్లాడాలని స్పష్టం చేశారు. పోలింగ్ స్టేషన్‌కు 100మీటర్ల పరిధిలో ఇష్టానుసారం ప్రవర్తించరాదన్నారు.
రిసెప్షన్ సెంటర్‌లో కమ్యూనికేషన్, లైటింగ్, తాగునీరు, ప్రథమ చికిత్స, రిఫ్రెష్‌మెంట్, రవాణా, టాయిలెట్లు, పవర్ బ్యాకప్, పరిశీలకులకు గదులు, ఇంటర్నెట్, టెలిఫోన్ మొదలైన వాటి కోసం సరైన ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 2-టైర్ గార్డింగ్ సిస్టమ్, CCTV కవరేజీతో పాటు అభ్యర్థి తరపున వాచ్ చేసే వ్యక్తికి సౌకర్యం కల్పించాలన్నారు. కమిషన్ సూచనలకు అనుగుణంగా అన్ని పోల్ EVMలను స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపర్చిన వెంటనే సంబందిత ధృవీకరణ పత్రాన్ని జిల్లా ఎన్నికల అధికారులు సీఈవోకు సమర్పించాల్సి ఉందన్నారు.
*(పి ఆర్ ఓ, సి ఇ ఓ కార్యాలయం,ఆంధ్రప్రదేశ్ సచివాలయం వారిచే జారీ)*