ఎన్నికల వేళ రూ.342 కోట్లు సీజ్
సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.342కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా వెల్లడించారు. రూ.107.96 కోట్ల నగదు జప్తు చేయగా.. వాటిని అక్రమంగా తరలిస్తున్న 7,305 మందిని అరెస్టు చేశామన్నారు. రూ.58.78 కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ.35.61కోట్ల విలువైన మాదకద్రవ్యాలను జప్తు చేయగా 1,730 మందిని అరెస్ట్ చేశారు. అక్రమంగా రవాణా చేస్తున్న రూ.123.64కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు సీజ్ చేశామన్నారు.